మార్కులు తక్కువ వచ్చాయని.. పెళ్లి రద్దు చేసిన వరుడు.. చివర్లో షాకింగ్ ట్విస్ట్

0
94

తమకు అమ్మాయి నచ్చలేదనో, లేక అభిరుచులు కలవలేదనో.. పెళ్లిళ్లు రద్దు చేస్తారు. కొందరు కారణాలు చెప్పకుండానే.. ఇంటి నుంచి పారిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఉత్తరప్రదేశ్‌లో ఓ వరుడు మాత్రం యువతికి తక్కువ మార్కులొచ్చాయని పెళ్లి రద్దు చేశాడు. తీరా తీగ లాడితే.. అప్పుడు అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. కట్నం కోసమే వరుడు ఈ డ్రామాలు చేశాడమని తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని క‌న్నౌజ్ జిల్లా తిర్వ కొత్వాలి ప్రాంతానికి చెందిన సోని అనే అమ్మాయికి బగాన్వా గ్రామానికి చెందిన సోను అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. గతేడాది డిసెంబర్ 4వ తేదీన రూ.60 వేలు ఖర్చు చేసి మరి.. సోని తండ్రి వీరి నిశ్చితార్థం చేశాడు. అబ్బాయికి రూ.15 వేలు విలువ చేసే బంగారపు రింగ్‌ని కూడా బహూకరించాడు. అయితే.. ఇంతలోనే వరుడు ఓ షాకిచ్చాడు. సోని ఇంటర్మీడియట్ మార్కుల షీట్‌ చూసి.. అమ్మాయికి వచ్చాయని, ఆమెతో పెళ్లి చేసుకోలేనంటూ బాంబ్ పేల్చాడు. సోని తండ్రితో పాటు బంధువులంతా ఎంత నచ్చజెప్పినా.. వరుడు తరఫు వాళ్లు పెళ్లికి నిరాకరించారు.

ఎందుకిలా వ్యవహరిస్తున్నారని చూస్తే.. కట్నం కోసమని తేలింది. అధిక కట్నం ఇస్తే తప్ప పెళ్లి జరగదని వాళ్లు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక.. వధువు వధువు బంధువులు పోలీసుల్ని ఆశ్రయించారు. అడిగినంత కట్నం ఇవ్వలేదని.. ఇంటర్మీడియట్ మార్కుల్ని సాకుగా చూపించి, వివాహం రద్దు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here