8 ఏళ్ల బాలిక.. కోట్లకు వారసురాలు.. అన్నీ వదిలి సన్యాసం

0
369

కోట్ల రూపాయలకు వారసురాలు. వజ్రాల వ్యాపారం, సిరిసంపదల్లో పుట్టిన అమ్మాయి జీవితం సాధారణంగా ఎలా ఉంటుంది. కాలు కందకుండా పెంచుకుంటారు తల్లిదండ్రులు. జీవితాంతం లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా 8 ఏళ్ల అమ్మాయి మాత్రం చిన్నవయసులోనే సన్యాసాన్ని స్వీకరించింది. గుజరాత్ వజ్రాల వ్యాపారి కుమార్తె అత్యంత చిన్నవయసులోనే సన్యాసాన్ని స్వీకరించింది.

దేవాన్షి సంఘ్వీ, గుజరాత్ సూరత్ కు చెందిన మల్టీ మిలియనీర్, వజ్రాల వ్యాపారి వారసురాలు గత వారం సన్యాసాన్ని స్వీకరించింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. జైన కమ్యూనిటీకి చెందిన దేవాన్షి సంఘ్వీ అండ్ సన్స్ వజ్రాల వ్యాపారానికి వారసురాలు. 8 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుంది. జైన మతంలో బాల సన్యాసిని కావాలని, అన్ని సుఖాలను త్యజించారు. మంగళవారం ఆమెకు గొప్ప వేడుక నిర్వహించింది కుటుంబం.

దేవాన్షి తల్లిదండ్రులు ధమేష్, అమీ సంఘ్వీ అలాగే ఆమె ఐదేళ్ల చెల్లి కావ్య కూడా అందరూ సింపుల్ గా జీవితాలు గడుపుతున్నారని ఈ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు వెల్లడించారు. దేవాన్షి ఎప్పుడూ టీవీ, సినిమా చూడలేదని.. రెస్టారెంట్లకు, టూర్లకు వెళ్లలేదని, చివరకు పెళ్లిళ్లకు కూడా హాజరయ్యేది కాదని కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఇప్పటివరకు 367 దీక్షా కార్యక్రమాల్లో పాల్గొందని, గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని ప్రముఖ జైన పుణ్యక్షేత్రమైన పాలిటానాలో ఉపవాసం ఉండేలా చేయడంతో, రెండు సంవత్సరాల వయస్సు నుండి సన్యాసినిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు వెల్లడించారు.

దీక్ష కోసం దేవాన్షి ఇతర సన్యాసులతో కలిసి ఏకంగా 600 కిలోమీటర్లు నడిచింది. దీక్షలో సాధారణంగా ‘‘కేస-లోకా’’ అనే జట్టును తీసేసే ఆచారం ఉంది. ఇది శరీరంపై ఆశ లేదని సూచిస్తుంది. ఆమె జైనమతం మార్గాలను రెండేళ్లలోొ నేర్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here