ఎన్నికల ముందు గుజరాత్ సంచలన నిర్ణయం.. యూనిఫాం సివిల్ కోడ్ పై కమిటీ

0
49

గుజరాత్ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, రేపో మాపో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే గుజరాత్ లో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ అనుకుంటోంది. కాంగ్రెస్, ఆప్ పార్టీలు మాత్రం బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని పోరాడుతున్నాయి.

ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. శనివారం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ.. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సఘవి ఈ రోజు ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కమిటీ సభ్యులను ప్రకటించనున్నారు.

శుక్రవారం రోజున ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదే బాటలో గుజరాత్ ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. గోవా తరువాత దీన్ని అమలు చేస్తున్న రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించబోతోందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఎలాంటి మత ప్రమేయం లేకుండా అందరికి కూడా ఒకే చట్టాలు ఉండేలా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తున్నామి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఈ ఏడాది మేలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కూడా యూనిఫా సివిల్ కోడ్ తీసుకువస్తామని ప్రకటించారు. దీంతో మరోసారి దేశంలో ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ మొదలైంది. ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశంలోని అందరు పౌరులకు ఒకేటే పౌర నియమావళి ఉండాలని.. యూనిఫా సివిల్ కోడ్ ను సూచిస్తుంది.

ఇదిలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ దీనిని రాజ్యాంగ విరుద్ధమైందని.. మైనారిటీల వ్యతిరేక చర్య అని పేర్కొంది. ద్రవ్యోల్భనం, ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగంపై ప్రజల దృష్టి మరల్చేందుకే ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలను తీసుకువస్తున్నాయిని ఆరోపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here