హిందువులకు జొమాటో క్షమాపణ.. హృతిక్ రోషన్ యాడ్ ఉపసంహరణ

0
123

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన జొమాటో యాడ్ వివాదాస్పదం అయింది. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ను అవమానపరిచారని పలువురి నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ సంస్థ జొమాటో వెనక్కి తగ్గింది. జొమాటో రూపొందిని ఈ యాడ్ పై మధ్యప్రదేవ్ మహాకాళేశ్వర ఆలయ పూజరులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. ఈ ప్రకటన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఈ ప్రకటనను పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. హిందూ మనోభావాలను కించపరిచేలా ఈ యాడ్ ఉందని పేర్కొంటూ.. జొమాటో ప్రకటనను ఉపసంహరించుకోవాలని మహాకాళేశ్వర్ దేవాలయానికి చెందిన ఇద్దరు పూజారులు శనివారం డిమాండ్ చేశారు.

ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా జొమాటో ఈ ప్రకటనను ఉపసంహరించుకుంది. ‘‘ మేము మా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాము. ఉద్దేశపూర్వకంగా ఎవరి విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీయాలనే ఆలోచన లేదు’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. హృతిక్ రోషన్ నటించిన ఈ ప్రకటనలో ఉజ్జయిని ఉన్నట్లయితే థాలీ తినాలని అనిపించింది.. అందుకు దానిని మహాకాల్ నుంచి ఆర్డర్ చేశానని చెప్పడం యాడ్ లో కనిపిస్తుంది.

హృతిక్ రోషన్ నటించిన ఈ యాడ్ లో ప్రసిద్ధ ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాల్ రెస్టారెంట్ ను సూచిస్తోందని.. ఆలయాన్ని కాదని ఈ మేరకు ప్రకటనలో వెల్లడించింది. పాన్ ఇండియా ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రతీ నగరంలో ఉన్న ప్రజాధరణ కలిగిన రెస్టారెంట్లు..అక్కడి వంటకాలు గురించి తెలుపుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఉజ్జయినిలోని మహాకాల్ రెస్టారెంట్, మా కస్టమర్లలో ఒకటి అని జొమాటో వెల్లడించింది. దేశంలో ప్రసిద్ధ 12 జ్యోతిర్లింగాల్లో మహాకాళేశ్వర్ కూడా ఒకటి. ఈ యాడ్ ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ.. అక్కడి పురోహితులు అభ్యంతరం తెలిపారు.. తాజాగా ఈ యాడ్ ను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పింది జొమాటో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here