మరోసారి దేశంలో కరోనా పడగవిప్పొతోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. ప్రపంచ దేశాల్లో సైతం కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటి వరకు మరోసారి చైనాలో కరోనా దాడి కొనసాగడంతో భారీగా కేసులు నమోదయ్యాయి. కానీ.. కఠిన కోవిడ్ నిబంధనలు అమలు చేయడంతో కరోనాను కట్టడి చేయగలిగారు. అయితే ఇప్పుడు భారత్‌లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో.. 13,313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు 12,249 కేసులు నమోదు కావడం గమనార్హం.
ఇదే సమయంలో 10,972 మంది కరోనా నుంచి కోలుకోగా… 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,44,958కి పెరిగింది. వీరిలో 4,27,36,027 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,941 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.60 శాతంగా, పాజిటివిటీ రేటు 2.03 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,96,62,11,973 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14,91,941 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.