ఐసీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

0
148

ఐసీఎస్ఈ 10 తరగతి ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(CISCE) ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి 10వ, 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.cisce.org ద్వారా చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ కాకుండ విద్యార్థులు తమ ఐసీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను డిజిలాకర్ యాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా చూసుకోవచ్చు. దీనితో పాటు విద్యార్థులు తమ ఏడు అంకెల యూనిక్ ఐడీని 09248082883కు మెసేజ్ చేయడం ద్వారా కూడా తమ ఫలితాలను పొందవచ్చు. బోర్డు చరిత్రలో మొదటిసారిగా ఒకే విద్యా సంవత్సరం సీఐఎస్‌సీఈ రెండు పరీక్షలను నిర్వహించారు.

ఫలితాన్ని ఎలా చూసుకోవచ్చు..

దశ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ cisce.orgకి వెళ్లండి.
దశ 2- హోమ్ పేజీలో “ICSE 10th Results” లింక్‌పై క్లిక్ చేయండి.
దశ 3- అభ్యర్థించిన సమాచారాన్ని పూరించండి.
దశ 4- ఫలితం మీ ముందు ఉంటుంది.
దశ 5- దీన్ని డౌన్‌లోడ్ చేయండి.

10వ తరగతి ఫలితాల్లో ఎవరికైనా తమ మార్కుల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లైతే ఆ విద్యార్థులు రీ వాల్యూవేషన్ కోరకు ఒక్కో సబ్జెక్టు కౌన్సిల్‌కు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం.. కౌన్సిల్ కెరీర్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది జూలై 17, సాయంత్రం 5 గంటల నుండి జూలై 23 వరకు చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here