ఇండియాలో కరోనా కేసులు గుబులు పెట్టిస్తున్నాయి. ఫోర్త్ వేవ్ తప్పదా..అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరసగా కోన్ని రోజుల నుంచి వరసగా కేసుల సంఖ్య 15 వేలకు మించి నమోదు అవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశంలో వ్యాక్సినేషన్ వల్ల మరణాల సంఖ్య చాలా వరకు తగ్గింది. సెకండ్ వేవ్ సమయంలో నమోదైనట్లుగా ప్రస్తుతం మరణాలు లేవు. వ్యాక్సినేషన్ వల్లే మరణాలకు అడ్డుకట్ట పడింది.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో 16,678 కేసులు నమోదు అయ్యాయి. 26 మంది మహమ్మారి బారినపడి చనిపోయారు. మొత్తం 14,629 మంది కోవిడ్ బారి నుంచి రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 1,30,713 కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే డెయిలీ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. గత వారం 4కు పరిమితమైన పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.99 శాతంగా ఉంది. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 4,36,39,329 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 4,29,83,162 మంది కోలుకుంటే.. 5,25,454 మంది మరణించారు.
దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 198,88,77,537 డోసుల టీకాలు ఇచ్చారు. గడిచిన రోజులో 11,44,145 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 24 గంటల్లో దేశంలో మొత్తంగా 2,78,266 మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 56,06,54,133 మంది కరోనా బారిన పడితే..63,73,019 మంది మరణించారు.