ఇండియాలో మంకీపాక్స్ కలకలం.. తొలికేసు నమోదు..?

0
177

ఇండియాలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తం అయ్యారు. అయితే సదరు వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల యూరప్ నుంచి ఓ వ్యక్తి ఇండియాకు వచ్చాడు. సదరు వ్యక్తి స్టడీ కోసం యూరప్ వెళ్లాడు. వెస్ట్ మిడ్నాపూర్ కు చెందిన యువకుడి శరీరంపై దద్దర్లు ఏర్పడ్డాయి. మంకీపాక్స్ లక్షణాలతో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. మంకీపాక్స్ గా అనుమానించడంతో అతని శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపారు. అయితే అతని శాంపిళ్ల రిజల్ట్ ఇంకా రాలేదు. అనుమానిత వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచారు. అతనికి సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులను కూడా వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ అనుమానతంతో ఓ వ్యక్తి శాంపిళ్లను పరీక్షలకు పంపడం ఇదే తొలిసారని.. దద్దుర్ల నుంచి తీసిన ద్రవాన్ని పరీక్షల నిమిత్తం పంపించామని వైద్యులు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతోంది మంకీపాక్స్ వ్యాధి. ఇప్పటికే 58 దేశాల్లో 6000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా యూకే, స్పెయిన్, జర్మనీ, ప్రాన్స్ వంటి యూరోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 85 శాతం కేసులు ఒక్క యూరోప్ ఖండంలోనే నమోదు అయ్యాయి. ఆఫ్రికా దేశానికి చెందిన ఈ వ్యాధి యూరప్ దేశాలతో పాటు యూఎస్ఏ, మిడిల్ ఈస్ట్ లోని కొన్ని దేశాలకు, ఇజ్రాయిల్ దేశానికి వ్యాపించింది. స్వలింగ సంపర్కం ద్వారా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here