ఇండియా తొలి గర్భశయ క్యాన్సర్ నిరోధక టీకా… రేపు విడుదల చేయనున్న కేంద్రం

0
99

ప్రపంచ వ్యాక్సిన్ తయారీతో కీలకంగా ఉన్న ఇండియా మరో కీలక మైలురాయిని చేరుకుంది. పూర్తి స్వదేశీగా తయారు చేయబడిన తొలి గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకాను రేపు విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 1న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్, క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్(క్యూ హెచ్ పీ వీ)ను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ(డీబీటీ)సంయుక్తంగా తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్ కు డగ్ర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) జూలై 12న అనుమతి ఇచ్చింది.

కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యనైజేషన్ చైర్మన్ ఎన్కే ఆరోరా మాట్లాడుతూ.. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ ప్రారంభించడం అద్భుతమైన అనుభవం అని అన్నారు.. ఇప్పడు మన కూతుళ్లు, మనవరాళ్లు ఈ వ్యాక్సిన్ పొందుతారని.. ఇది చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద 9-14 ఏళ్ల బాలికలకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంలో ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమైంది, చివరిదని ఆయన అన్నారు. ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని.. 85-90 శాతం గర్భాశయ క్యాన్సర్ కేసులు హ్యామన్ పాపిల్లోమా వైరస్ వల్లే వస్తుందని.. ఈ వ్యాక్సిన్ ఈ వైరస్ ను నిరోధిస్తుందని ఆయన అన్నారు. చిన్న పిల్లలకు ఇస్తే దాదాపుగా 30 ఏళ్ల క్యాన్సర్ సంభవించదని డాక్టర్ ఆరోరా తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2019 నుంచి భారతదేశంలో 41,91,000 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ వల్ల మరణించారు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ప్రారంభం అయినప్పుడు దీన్న సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మహిళలందరికీ గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియాలో 30 ఏళ్లకు పైబడిన మహిళలల్లో ఈ క్యాన్సర్ తరుచుగా సంభవిస్తోంది. హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) ఇన్ఫెక్షన్ గర్భాశయ క్యాన్సర్ కు కారణం అవుతోంది. ప్రస్తుతం వస్తున్న గర్భాశయ క్యాన్సర్ టీకా.. యోని, వల్వార్ క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here