Uttar Pradesh: డెంగ్యూ రోగికి ప్లేట్‌లెట్స్‌కు బదులు లైమ్ జ్యూస్ ఎక్కించిన ఆస్పత్రి

0
88

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆస్పత్రి నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణాలు తీసింది. డెంగ్యూలో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి ప్లేట్‌లెట్స్‌కు బదులు అదే రకంగా కనిపించే లైమ్ లేదా బత్తాయి జ్యూస్ ఎక్కించారని, దీంతో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం స్పందించింది. ప్రాథమిక విచారణ ప్రారంభించిన అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

32 ఏళ్ల వ్యక్తి డెంగ్యూతో బాధపడుతూ ప్రయాగ్ రాజ్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో చేరాడు. అయితే రోగికి ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గడంతో వీటిని ఎక్కించాలని వైద్యులు సూచించారు. అయితే ఈ క్రమంలో ప్లేట్‌లెట్స్‌కు బదులు లైమ్ జ్యూస్ ఎక్కించినట్లు పేషెంట్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇది ఎక్కించిన తర్వాత బాధితుడి శరీరంపై ఎర్రని మచ్చలు ఏర్పడి అతని పరిస్థితి క్షీణించింది. వెంటనే సదరు ఆస్పత్రి నగరంలోని మరో ఆస్పత్రికి రిఫర్ చేసింది. అక్కడే అతడు మరణించాడు. అయితే రెండో ఆస్పత్రిలో వైద్యులు ప్లేట్‌లెట్స్‌ బ్యాగును పరిశీలించి.. ఇది నకిలీదని లైమ్, బత్తాయి జ్యూస్ అని చెప్పారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

దీనిపై యూపీ డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ స్పందిస్తూ, ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నానమని.. నిందితులుగా తేలితే శిక్షిస్తామని ట్వీట్ చేశారు. ఆస్పత్రిని సీజ్ చేశారు అధికారులు. శాంపిల్స్ పరీక్షించే వరకు ఇలాగే ఉంటుందని ప్రయాగ్ రాజ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. అయితే పప్లేట్‌లెట్స్‌ ను రోగి బంధువులే సేకరించారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. మూడు యూనిట్ల ప్లేట్‌లెట్స్‌ ఇచ్చిన తర్వాత రోగిలో రియాక్షన్స్ ప్రారంభం అయ్యాయని ఆస్పత్రి వెల్లడించింది. విచారణకు సహకరిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here