పరీక్ష రాయడానికి వెళ్లిన వారిని చెక్ చేసి పరీక్ష రాసేందుకు లోనికి అనుమతించడం ఏ పాఠశాలఅయినా చేయాల్సిన పని అదిరూల్. కానీ కొల్లాం జిల్లా ఆయుర్‌లోని మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పాఠశాల యాజమాన్యం చేసిన పని దేశంలోనే సంచలనంగా మారింది. సభ్య సమాజం సిగ్గు పడేలా చేసింది. జూలై ఆదివారం (17న) జరిగిన నీట్ పరీక్షలో విధ్యార్థినులపై దారుణంగా ప్రవర్తించింది. నీట్ విధ్యార్థినులను చెక్ చేయడమే కాకుండా లోదుస్తులు (బ్రా)ను తీసేయాలని పేర్కొంది. దీంతో విధ్యార్థులు షాక్ తిన్నారు. లోదుస్తులు ఎందుకు తీయాలని ప్రశ్నించగా.. తీస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామనడంతో.. గత్యంతరం లేక లోదుస్తులను తీసి పరీక్ష రాసేందు లోనికి వెళ్ళాల్సి వచ్చింది. అయితే పరీక రాసేప్పుడు విధ్యార్థినులు తమ కురులను ముందుకు వేసుకుని రాయాల్సి వచ్చింది. మరి కొందరు విద్యార్థులైతే కన్నీటితో పరీక్షను రాసారు. పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థినులు తల్లిదండ్రులను ఈ విషయం తెలుపడంతో.. ఇదికాస్త వివాదాస్పదమైన నేపథ్యంలో.. నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ చర్యలకు ఉపక్రమించింది. వివిధ మీడియా కథనాల ద్వారా తమకు సమాచారం అందిందని, ఈనేపథ్యంలో.. కమిటీ ఏర్పాటు చేసినట్లు, కమిటీ సభ్యులు కొల్లంను సదంర్శించి నివేదిక రూపొందిస్తారని, దాని ఆధారంగా తుది చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
కాగా.. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. బయోమెట్రిక్ తనిఖీలు చేసి బాధ్యత ఏజెన్సీ లదేనని తెలిపింది. అయితే ఇది ఇలా వుండగా ఆదివారం పరీక్ష పూర్తయిన అనంతరం పెద్దమొత్తంలో లోదుస్తులను ఓఅట్టపెట్టెలో కళాశాల సిబ్బంది బయటకు పెడేసినట్లు కొందరు విద్యార్థులు తెలిపారు. అయితే ఈ ఘటనపై కేరళ విద్యాశాఖామంత్రి ఆర్ బిందు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఈ పరీక్ష మార్గదర్శకాలను సమీక్షించాలని కోరుతూ కేరళ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ కు డిమాండ్ చేస్తూ ఆర్ బిందు లేఖ రాసారు. అయితే లోక్ సభలో కూడా దీనిపై చర్చ జరపాలని తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. కాగా.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు మహిళలను అరెస్ట్ చేసినట్లు , వీరంతా పరీక్ష జరిగిన రోజున కళాశాలలో విధులు నిర్వర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.