అసలే సంక్షోభం.. సీఎం, గవర్నర్‌ ఇద్దరికీ కోవిడ్..!

0
1085
Maharashtra
Maharashtra

దేశం మొత్తం మరోసారి మహారాష్ట్ర వైపు చూస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత ఎన్‌సీపీ ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన.. అయితే, అప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక వార్త.. వస్తూనే ఉంది.. అయితే, శివసేన మంత్రి తిరుగుబాటు జెండా ఎగరవేశారు.. ఏకంగా 34 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రం బోర్డర్‌ దాటేసి క్యాంపు పెట్టేశాడు.. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.. మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే యోచనలో శివసేన పార్టీ ఉన్నట్టు స్పష్టం అవుతోంది.. విధాన సభను రద్దు చేయొచ్చంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేయడం చర్చగా మారింది.. ఇప్పటికే ట్విట్టర్‌లో మంత్రి హోదాను ఆదిత్య థాక్రే తొలగించుకోవడం ఆస్తికరంగా మారాయి.. శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహా రాజకీయాల్లో హీట్‌ పెరగగా.. శివసేకు ఉన్న మొత్తం 55మంది ఎమ్మెల్యేల్లో ఏక్‌నాథ్‌ షిండే వెంటే 34మంది ఎమ్మెల్యేలు వెళ్లడంతో.. ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామంతో సీఎం ఉద్ధవ్‌ థాక్రే వైపు మిగిలింది కేవలం 21 మందే కావడంతో.. ఎప్పుడైనా సర్కార్‌ కూలిపోవచ్చు అనే చర్చ సాగుతోంది.

ఈ పరిణామాలు మహారాష్ట్రలో ఉత్కంఠ రేపుతుండగా.. మరో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరింది.. సీఎం ఉద్ధవ్‌ థాక్రే, గవర్నర్‌ భగత్‌ సింగ్‌కు కూడా కరోనా సోకింది.. ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఐసోలేషన్‌కే పరిమితం కావడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది.. ఇక, గవర్నర్‌ కూడా కరోనా బారినపడడంతో.. గోవా గవర్నర్‌కు మహారాష్ట్ర ఇంఛార్జ్‌ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు.. మరోవైపు.. ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అర్థంకానీ పరిస్థితి ఉంది.. శివసేన, ఉద్ధవ్ థాక్రే ఎన్ని ప్రయత్నాలు చేసినా, సంప్రదింపులు జరిపినా ఏక్‌నాథ్ షిండే దిగిరాకపోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here