13 మందిని చంపిన పులి.. ఎట్టకేలకు పట్టుబడింది.

0
47

మహారాష్ట్రలో చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. సీటీ-1గా పిలువబడుతున్న ఈ పులి గత కొంత కాలంగా మహారాష్ట్రలోని విదర్భ జిల్లాలైన గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల్లో పలువురిపై దాడి చేసి హతమార్చింది. ఈ ప్రమాదకరమైన పులిని గురువారం అధికారులు పట్టుకున్నారు. ఇప్పటివరకు 13 మందిని హతమార్చింది ఈ పెద్దపులి. గడ్చిరోలి జిల్లా వాడ్సా అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తోంది.

చంద్రపూర్ జిల్లాలోని వాడ్సాలో ఆరగురిని, భండారాలో నలుగురిని, బ్రహ్మపురి ఫారెస్ట్ రేంజ్ లో ముగ్గురిని పులి చంపింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) నాగ్‌పూర్ అక్టోబర్ 4న జరిగిన సమాచారంలో ఈ సీటీ-1 పులిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తాడోబా టైగర్ రెస్క్యూ టీమ్, చంద్రపూర్, నవేగావ్-నాగ్జిరా నుంచి ర్యాపిడ్ రెస్సాన్స్ టీములు, ఇతర యూనిట్లు పులిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఆపరేషన్ ప్రారంభించారు. గురువారం ఉదయం వాడ్సా అటవీ రేంజ్ లో దానిని పట్టుకున్నారు అధికారులు.

పునరావాసం కోసం దీనిని 183 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్ పూర్ గోరేవాడ రెస్క్యూ సెంటర్ కు తరలించారు అధికారులు. సాధారణంగా పిల్లలను రక్షించుకోవడం లేదా..ప్రాణాలు కాపాడుకునే క్రమంలో మాత్రమే మానవులపై దాడులు చేస్తుంటాయి. చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలు పూర్తిగా అటవీ ప్రాంతాలతో నిండి ఉండటంతో పాటు దేశంలో ప్రముఖమైన ‘‘ తాడోబో టైగర్ రిజర్వ్’’ కూడా ఈ ప్రాంతంలోనే విస్తరించి ఉంది. దీంతో తరుచుగా ఈ రెండు జిల్లాల వాసులు పులుల దాడులకు గురవుతుంటారు.

ఇటీవల మనిషి మాంసానికి అలవాటు పడిన మ్యాన్ ఈటర్ పులిని బీహార్ లో కాల్చి చంపారు. ఈ పులి దాడిలో ఇప్పటి వరకు 9 మంది మరణించారు. చంపారన్ జిల్లాలో వాల్మీకి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పలు గ్రామాలపై దాడులు చేస్తూ పలువురిని హతమార్చింది ఈ పులి. చివరకు ఇంట్లో నిద్రిస్తున్న వారిని కూడా ఈడ్చుకెళ్లి చంపేసింది. దీంతో బీహార్ ప్రభుత్వం దీనిపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఈ పులిని చంపేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here