పానీపూరి అమ్మిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

0
175

ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థులపై కామెంట్ల తూటాలు కురిపిస్తూ వార్తల్లో నిలిచే పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇప్పుడు ఆమె ఒక ప్రత్యేకమైన కారణంతో మరోసారి వార్తల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో మమతా బెనర్జీ రుచికరమైన పానీపూరి వంటకాలు చేస్తూ కనిపించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వారికి ముఖ్యమంత్రి పానీపూరి తయారు చేసి తన చేతుల మీదుగా అందించారు.

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ డార్జిలింగ్‌లో పర్యటించారు.గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ)కి కొత్తగా ఎన్నికైన 45 మంది సభ్యుల ప్రమాణస్వీకారోత్సంలో పాల్గొనేందుకు ఆమె ఈ హిల్ స్టేషన్‌కు వచ్చినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.మధ్యాహ్నం సిలిగురి సమీపంలోని బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్న సీఎం, మాల్‌గా పేరుగాంచిన డార్జిలింగ్‌ క్రాస్‌రోడ్‌లో మంగళవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అనంతరం డార్జిలింగ్ లోని మాల్ రోడ్‌లో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరీ విక్రయించారు. దాంతో ముఖ్యమంత్రి స్పెషల్ పానీ పూరీ కోసం పిల్లలు,పెద్దలు ఎగబడ్డారు. అక్కడి ప్రజలతోనూ ఆమె మాట్లాడారు. మమతా పానీ పూరీ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here