యువ‌తికి వేధింపులు.. కాపాడిన హిజ్రాలు

0
228

ఒంట‌రిగా వున్న యువ‌తిని టార్గెట్ చేసాడో దుండగుడు. ఆ ఇంట్లో య‌వ‌తి ఒంటిరిగా వుండ‌టం గ‌మ‌నించి రోజు కాలింగ్ బెల్ నొక్కి వేధించేవాడు. యువ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చి చూడ‌గా ఎవ‌రు లేక‌పోవ‌డంతో.. త‌లుపులు వేసుకుని లోనికి వెళ్లిపోయేది. ఇలా కొద్దిరోజులు సాగింది. అయితే ఒక‌రోజు తెల్ల‌వారుజామున వ‌చ్చిన ఆ దుండ‌గుడు ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. లోప‌ల వున్న యువ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చి చూడ‌గా ఎవ‌రు లేక‌పోవ‌డంతో.. లోనికి వెలుతున్న‌ప్పుడు ఆమెతో పాటు ఇత‌ను కూడా లోనికి దూరాడు. త‌లుపులు లాక్ చేసి ఆమెను వేధించ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో ఆ యువ‌తి కేక‌లు వేసింది. అక్క‌డి నుంచి వెలుతున్న హిజ్రాలు ఆమెను కాపాడారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూర్ లోని కేఆర్ పురం లోని వివేక‌న‌గ‌ర పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో కోర‌మంగ‌ళ స‌మీపంలోని ఈజిపుర‌లో చోటుచేసుకుంది.

న‌గ‌రంలోని ఈజిపురంలో నివాసముంటూ నర్సింగ్‌ కోర్సు చదువుకుంటున్న మిజోరాంకు చెందిన యువతిపై దుండగుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మసురుల్‌ షేక్ కన్నేశాడు. ఇత‌ను ఒక హోటల్లో పనిచేసే మసురుల్‌ షేక్‌ రోజూ తెల్లవారు జామున యువతి గది డోర్‌బెల్‌ కొట్టి పారిపోయేవాడు. యువ‌తి వుంటున్న ఇంటి డోర్‌ తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. అయితే.. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజాము కూడా అదే మాదిరిగా బెల్‌ కొట్టాడు. యువ‌తి డోర్‌ తీయగానే గదిలోకి చొరబడి యువతిపైన లైంగిక దాడికి యత్నించగా కేకలు వేసింది. ఈనేప‌థ్యంలో.. అక్కడ సమీపంలో ఉన్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ వచ్చి యువతిని కాపాడారు. అతన్ని పట్టుకుని, స్థానికులు వచ్చి దుండగునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువ‌తిని కాపాడానికి హిజ్రాల‌ను స్థినికులు, బాధితురాలు, పోలీసులు ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here