వ్యభిచార గృహం నడుపుతున్న బీజేపీ నేత.. ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్‌

0
132

మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మారక్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాలో అరెస్టు చేశారు. ఆయన ఫార్మ్‌హౌస్‌లో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. మేఘాలయలోని తురా పట్టణానికి సమీపంలో బెర్నార్డ్‌కు రింపు బగన్ అనే ఓ ఫార్మ్‌హౌస్ ఉంది. ఇక్కడ వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. శనివారం ఈ ఫార్మ్‌హౌస్‌పై మేఘాలయ పోలీసులు దాడి చేసి, ఆరుగురు మైనర్లను విముక్తి చేసి.. 73 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తునకు సహకరించాలని బెర్నార్డ్‌ను కోరినప్పటికీ, ఆయన దర్యాప్తును తప్పించుకుంటున్నారని పోలీసులు ఆరోపించారు.

మేఘాలయ పోలీసులు బీజేపీ నాయకుడి కోసం లుకౌట్ నోటీసు జారీ చేసిన కొన్ని గంటల తర్వాత అరెస్టు జరిగింది.నిన్న తురా కోర్టు బీజేపీ నేతపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మారక్‌కు చెందిన తురాలోని ఫార్మ్‌హౌస్‌లో బంధించబడిన ఆరుగురు పిల్లలను శనివారం రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఆ స్థలంలో వ్యభిచార గృహం నిర్వహించబడుతుందని పేర్కొంటూ, ఈ దాడిలో 47 మంది యువకులు, 26 మంది మహిళలను నిర్బంధించారని పోలీసులు చెప్పారు. పోలీసులు భారీ మొత్తంలో మద్యం, సుమారు 500 గర్భనిరోధక ప్యాకెట్లు, సెల్‌ఫోన్‌లుస నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర పోలీసు చీఫ్ ఎల్‌ఆర్ బిష్ణోయ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here