Minister Narottam Mishra Strong Counter To Arjun Kapoor: ఈమధ్య బాయ్‌కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అర్జున్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందని, ఇప్పటివరకూ దీనిపై మాట్లాడకుండా తాము తప్పు చేశామని, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే బాలీవుడ్ మనుగడ కోల్పోతుందని అన్నాడు. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించిన అర్జున్.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై బాలీవుడ్ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చాడు. ఈ సమస్యకు మూలకారణం ఎక్కడుందో కనుక్కొని, ఇలాంటివి ట్రెండ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
అసలే కోపం మీద నెటిజన్లు ఉంటే, అర్జున్ కపూర్ వ్యాఖ్యలు మంటపై పెట్రోల్ పోసినట్టు భగ్గుమన్నాయి. దీంతో.. అతనిపై తారాస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వారితో పాటు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం అర్జున్ కపూర్‌కి చురకలంటించారు. అర్జున్ కపూర్‌ను ఒక ఫ్లాప్ నటుడని పేర్కొన్న ఆయన.. జనాన్ని బెదిరించే కంటే, నీ నటనపై దృష్టి సారిస్తే బాగుంటుందని హితవు పలికారు. తమ చిత్రాల్లో హిందుత్వాన్ని టార్గెట్ చేస్తే, పరిణామాలు ఇలాగే ఉంటాయన్నారు. తమ చిత్రాల్లో హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. టుక్డే టుక్డే గ్యాంగ్‌కు మద్దతు పలికేవారు ప్రజలను బెదిరించడం మానుకోవాలని హెచ్చరించారు. నీ పని నువ్వు చేసుకో అంటూ అర్జున్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.