కార్యకర్తను పెళ్లి చేసుకున్న మహిళా ఎమ్మెల్యే.

0
49

ఆమె అధికార పార్టీ శాసనసభ్యురాలు. అయితేనేం ఆ పార్టీకే చెందిన ఓ కార్యకర్తను పెళ్లి చేసుకుంది. తనకు అండగా నిలిచిన కార్యకర్తతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించింది. సాధారణంగా ఎమ్మెల్యేలు అంటేనే ఓ రకమైన ఇమేజ్ ఉంటుంది. అలాంటిది మహిళా ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తను పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశం అయింది.

పంజాబ్ రాష్ట్రం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీ ఎమ్మెల్యే నరిందర్ కౌర్ భరాజ్(28), కార్యకర్త మన్‌దీప్ సింగ్(29) ను వివాహమాడారు. సంగ్రూర్ నియోజకవర్గం నుంచి నరీందర్ కౌర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆప్ పార్టీలో పార్టీ మీడియా ఇంఛార్జ్ గా మన్‌దీప్ సింగ్ ఉన్నారు. మన్‌దీప్ సింగ్ పంజాబ్ లోని లఖేవాల్ గ్రామానికి చెందిన వ్యక్తి.

పాటియాలాలోని రోరేవాల్ గ్రామంలో వీరి వివాహం జరిగింది. స్థానికంగా ఉన్న గురుద్వారాలో వీరిద్దరికి వివాహం జరిగింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరు ఒకటయ్యారు. సీఎం భగవంత్ మాన్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ ఏడాది జూలైలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. అంతకు ముందే మాన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు.

ఈ ఏడాది జరిగిన పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంగ్రూర్ నుంచి ఆప్ తరుపున పోటీ చేసిన నరిందర్ కౌర్.. సీనియర్ కాంగ్రెస్ నేత విజయ్ ఇందర్ సింగ్లాను 36 వేల ఓట్ల తేడాతో ఓడించారు. పంజాబ్ శాసనసభలో యువ ఎమ్మెల్యేగా నరిందర్ కౌర్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here