దేశంలో విలువైన కంపెనీగా రిలయన్స్..విలువెంతో తెలిస్తే షాకవుతారు..

0
45

భారతదేశంలో అత్యంత విలువైన సంస్థల జాబితాలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటిస్థానంలో నిలిచింది. భారతదేశంలోనే అత్యంత విలువైన సంస్థగా ఉంది. ‘2022 బుర్గుండి ప్రేవట్ హురున్ ఇండియా 500 టాప్ 10’ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. మొత్తం అన్ని కంపెనీల మొత్తం విలువ రూ. 226 లక్షల కోట్లు( 2.7 ట్రిలియన్ డాలర్లు)గా ఉంది. భారతదేశం నుంచి 500 అత్యుత్తమ విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్ తరువాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉండగా.. మూడో స్థానంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ. 17.25 లక్షల కోట్లు కాగా.. టీసీఎస్ విలువ రూ. 11.68 లక్షల కోట్లుగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలువ రూ. 8.33 లక్షల కోట్లుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. టాప్ -10 కంపెనీల తరువాతి స్థానాల్లో.. నాలుగో స్థానంలో ఇన్ఫోసిస్(రూ. 6.33 లక్షల కోట్లు), ఆరోొ స్థానంలో భారతీ ఎయిర్ టెల్ ( రూ. 4.89 లక్షల కోట్లు), ఏడో స్థానంలో హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(రూ. 4.48 లక్షల కోట్లు), ఎనిమిదో స్థానంలో ఐటీసీ(రూ.4.32 లక్షల కోట్లు), తొమ్మిదో స్థానంలో అదానీ టోటల్ గ్యాస్(రూ. 3.96 లక్షల కోట్లు), 10వ స్థానంలో అదానీ ఎంటర్ ప్రైజెస్(రూ.3.81 లక్షల కోట్లు) ఉన్నాయి.

‘2022 బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500’ జాబితాలో చోటు దక్కించుకోవడానికి కంపెనీల కనీస విలువ రూ. 6,000 కోట్లు ఉండాలి. ఇది 725 మిలియన్ల డాలర్లకు సమానం. ప్రపంచం ఆర్థిక వ్యవస్థలు మందగమనంతో ఉన్నప్పుడు.. భారత్ మాత్రమే ఆశాజనకంగా ఉందని నివేదిక అభిప్రాయపడింది. జాబితాలో ఉన్న 500 కంపెనీలు భారతదేశ జీడీపీలో 29 శాతానికి సమానం. భారత మొత్తం శ్రామిక శక్తిలో 1.5 శాతం మంది వీటిలో ఉపాధి పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here