45 ఏళ్లుగా ఇదే ఆనవాయితీ..! జూలై 25 ప్రత్యేకత ఏమిటి..?

0
103

జూలై 25కు దేశ చరిత్రలో ఓప్రత్యేకత ఉంది. భారత ఆరో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నీలం సంజీవ్‌రెడ్డి నుంచి 14వ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వరకూ అందరూ జూలై 25నే ప్రమాణ స్వీకారం చేసినవారే. ఇప్పుడు అదేతేదీ, అదేనెలలో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయడం పై ప్రత్యేకమైన తేదీ జూలై 25తేదీ చరిత్రలో నిలిచింది. రామ్‌నాథ్ కోవింద్ భారత రాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తవడంతో.. ఆయన స్థానంలో నూతన రాష్ట్రపతిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము సోమవారం జూలై 25న ప్రమాణ స్వీకారం చేసారు. దేశానికి ముర్ము 15వ రాష్ట్రపతి కాగా, ఇప్పటి వరకూ 9 మంది రాష్ట్రపతులు జూలై 25నే ప్రమాణ స్వీకారం చేయడంతో.. అదేరోజు (జూలై 25) తేదీన ప్రమాణం చేయబోతున్న పదో రాష్ట్రపతి ముర్ము కావడం విశేషం.

ఈనేపథ్యంలో.. 1977 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రపతులుగా ఎన్నికైన వారంతా జూలై 25నే ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 25నే భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయాలని రాజ్యాంగంలో పేర్కొనలేదు.. ఇదేం నియమం కూడా కాదు. కానీ.. 1977 నుంచి ఇదే ఆనవాయితీగా వస్తోంది. అయితే.. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్.. ఆయన వారసుడు సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మాత్రమే జూలై 25న రాష్ట్రపతులుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కాగా..భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన 1950 జనవరి 26న తొలి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. 1952లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టారు. మే 13, 1962న సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి.. 1967 మే 13 వరకు పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత రాష్ట్రపతులుగా ఎన్నికైన జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మాత్రం పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగలేకపోయారు. పదవిలో ఉండగానే వారు మరణించడంతో.. మధ్యంతర ఎన్నికలొచ్చాయి. దీంతో ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికైన తెలుగు వ్యక్తి నీలం సంజీవ రెడ్డి 1977 జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత రాష్ట్రపతులుగా వ్యవహరించిన జ్ఞానీ జైల్ సింగ్, వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్‌నాథ్ కోవింద్ అదే రోజున ప్రమాణ స్వీకారం చేశారు. ఈనేపథ్యంలో.. వీరంతా పూర్తి కాలంలో పదవిలో కొనసాగడంతో, నూతన రాష్ట్రపతి జూలై 25న ప్రమాణ స్వీకారం చేయడం అనేది నలభై ఐదేళ్లుగా (45) ఆనవాయితీగా మారుతూ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here