Fastag scam: వైరల్ అవుతున్న వీడియోపై ఎన్‌పీసీఐ క్లారిటీ

0
120

ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు కార్ అద్దాలను తుడుస్తున్న క్రమంలో ఆ వ్యక్తి చేతికి ఉన్న డిజిటల్ వాచ్ తో ఫాస్టాగ్ స్టిక్కర్ స్కాన్ చేస్తున్నట్లు సదరు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇది గమనించిన కార్ యజమాని అతనిని ప్రశ్నించే సయమంలో అతడు పారిపోతాడు. దీంతో డిజిటల్ వాచీల ద్వారా ఫాస్టాగ్ స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు ఖాజేస్తున్నట్లు ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది.

వీడియో ఫేక్ అని తేల్చిన ఎన్‌పీసీఐ:

ఇంటర్నెట్ లో తెగవైరల్ అవుతున్న వీడియోపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియో ఫేక్ గా తేల్చింది. ఎన్ఈటీసీ ఫాస్టాగ్ ఎకో సిస్టమ్ అనేది ఎన్ పీసీఐ, అక్వైరర్ బ్యాంక్, ఇష్యూ బ్యాంక్, టోల్ ప్లాజా ఈ నాలుగింటి మధ్య లావాదేవీల కోసమే నిర్మించారని.. లావాదేవీలకు ఎండ్  టూ ఎండ్ భద్రతా ప్రోటోకాల్ ఉందని  తెలిపింది.

ఫాస్టాగ్ పర్సన్ టూ మర్చంట్ లావాదేవీల కోసమే పని చేస్తుందని వెల్లడించింది. ఫాస్టాగ్ నెట్ వర్క్ ద్వారా పర్సన్ టూ పర్సన్ లావాదేవీలు వీలు కావని క్లారిటీ ఇచ్చింది. ఒక వ్యక్తి ఫాస్టాగ్ లో ఉన్న డబ్బులను పొందలేరని దీంతో స్కాంకు ఆస్కారం లేదని వెల్లడించింది. వినియోగదారుడు టోల్ ప్లాజాల్లోనే చెల్లింపులు చేసేలా మాత్రమే ఫాస్టాగ్ ఉపయోగపడుతుందని తెలిపింది.

వినియోగదారుడు, బ్యాంకుల మధ్య లావాదేవీలు అనుమతించిన ఐపీ అడ్రస్, యూఆర్ఎల్ వైట్ లిస్టింగ్ చేయడం ద్వారా సురక్షితంగా ఉంటాయని తెలిపింది. టోల్ ప్లాజా సెంటర్ లో ఇన్ స్టాల్ చేసిన హార్డ్ వేర్, సెక్యురిటీ మాడ్యుల్ క్రిప్టోగ్రాఫికల్ గా భద్రపరచబడుతుందని ఎన్‌పీసీఐ  తెలిపింది. ఓపెన్ ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి లావాదేవీలు నిర్వహించబడవని ఎన్‌పీసీఐ క్లారిటీ ఇచ్చింది. దీనిపై పేటీఎం కూడా స్పందించింది. వీడియో చూపించినట్లు డిజిటల్ వాచ్ ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేయడం సాధ్యపడదని.. ఈ వీడియో ఫేక్ అని వివరణ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here