మంత్రి, ఎమ్మెల్యేకి ఫైన్‌.. ట్రాఫిక్‌ పోలీసులపై ప్రశంసలు..

0
27

సామాన్యులే పోలీసులు ఆపారంటే.. నేను ఎవరో తెలుసా? నా వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుంటారా? అనే డైలాగ్‌లు వేస్తారు.. అదే మంత్రి లేదా ఎమ్మెల్యేనే తప్పు చూస్తే.. చూసి చూడనట్టు వదిలేసిన సందర్భాలు కొన్ని ఉన్నా.. ఇప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు వ్యవహించిన తీరు.. ‘రూల్‌ ఈజ్‌ రూల్‌.. రూల్‌ ఫర్‌ ఆల్‌ ‘… అంటూ మంత్రి, ఎమ్మెల్యే ప్రయాణించిన బైక్‌పై ట్రాఫిక్‌ చలాన్‌ విధించిన వ్యవహారం సోషల్‌ మీడియాకు ఎక్కింది.. ఒడిశాలోని బాలాసోర్‌ ట్రాఫిక్​ పోలీసుల తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇంతకీ వాళ్లు చేసినా పనేంటి? అంటే.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఒడిశా మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా విధించారు.. ‘చట్టం అందరికీ సమానం’ అని భరోసా ఇస్తూ, బాలాసోర్ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పాఠశాల మరియు సామూహిక విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్‌ మరియు ఎమ్మెల్యే స్వరూప్ దాస్‌లకు జరిమానా విధించారు ట్రాఫిక్‌ పోలీసులు.

మంత్రి మరియు ఎమ్మెల్యే హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిల్ నడిపినందుకు రూ. 1,000 జరిమానా విధించినట్లు తెలిపారు ట్రాఫిక్‌ పోలీసులు.. మంత్రి సమీర్ రంజన్ దాస్ కూర్చున్న బైక్‌ను ఎమ్మెల్యే నడుపుతున్నారు. వారిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు… అయితే, ఆ బైక్‌ వారిలో ఎవరిదీ కాదు.. రాణిపటానాలోని బ్యాంక్ కాలనీకి చెందిన వాహన యజమాని పంకజ్ అగర్వాల్ పేరిట చలాన్ జారీ చేశారు పోలీసులు. అనంతరం ఎమ్మెల్యే స్వరూప్ దాస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిమానా మొత్తాన్ని చెల్లించారు.. కాగా, బాలాసోర్‌ లోని వివిధ పాఠశాలలను మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఎమ్మెల్యేతో కలిసి ఈ రోజు ఉదయం బాలాసోర్ టౌన్ హైస్కూల్, బారాబతి బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలపై ఉపాధ్యాయులు, విద్యార్థులతో చర్చించి వారి అవసరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్‌ అనూహ్యంగా పెరిగినట్టు తెలిపారు.. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రెండు లక్షల మంది విద్యార్థులు వచ్చినట్టు తెలిపారు.. రాష్ట్రంలో దాదాపు 11,000 మంది కొత్త ఉపాధ్యాయులను నియమించనున్నామని, ఇందుకు ఒడిశా హైకోర్టు అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన విదేశీ పర్యటన నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here