ఇదే హత్య హిందువులు చేసుంటే..? దేశంలో అల్లర్లు జరిగేవి..

0
73

ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను అతని ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఓ ఫ్రిజ్ లో దాచి పెట్టి 18 రోజుల పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుల ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్య కేసులో బాగేశ్వర్ ధామ్ సర్కార్ పండిట్ ధీరేంద్ర శాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధా హత్యపై మాట్లాడుతూ.. ఇదే హత్యను ఓ హిందువు చేసుంటే దేశంలో అల్లర్లు జరిగేవని అన్నారు. ఇతర మతాలవారు తమను తాము బలోపేతం చేసుకుంటూ.. సనాతన సంస్థలకు హనీ చేస్తున్నారని అన్నారు. హిందువుల మధ్య ఐక్యత లేదని అన్నారు. ఇదే హిందువులు చేసుంటే.. అల్లర్లు జరగడం, ఇప్పటికే ప్రభుత్వాలు మారే పరిస్థితి ఏర్పడేదని.. హిందువులు ఐక్యంగా లేకపోవడమే లోపం అని అన్నారు.

పండిట్ ధీరేంద్ర మాట్లాడుతూ.. సనాతర సంస్కృతి, భారతదేశపు కుమార్తెలను నిరంతరం కుట్రలు చేస్తున్నారని.. భారత సాధువులను, భారతదేశ గుర్తింపును నిరంతరం ప్రభావితం చేస్తుందని అన్నారు. అయితే మేము నిద్రపోతున్నామని.. సనాతర ధర్మం నిరంతరంగా దెబ్బతింటోందని ఆయన అన్నారు.

శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు సాక్ష్యాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే శ్రద్ధావిగా చెబుతున్న ఎముకలను సేకరించారు. దీంతో పాటు అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు. శ్రద్ధా మొబైల్, హంతకుడు వాడిని ఆయుధం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here