నరేంద్ర మోడీ కాళ్లకు మొక్కిన పపువా న్యూగినియా ప్రధాని..

0
216

ప్రధాని నరేంద్ర మోడీ జాపాన్ లో జీ-20 సమావేశం ముగిసిన తర్వాత ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్‌ఐపిఐసి) కోసం ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా మోడీ రికార్డుకెక్కారు. భారత ప్రధానికి అక్కడి ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఆయన పాదాలకు నమస్కరించారు. అందుకు ప్రతిగా మోడీ, జేమ్స్ మరాపేను కౌగిలించుకున్నారు. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత దేశాన్ని సందర్శించే ఏ నాయకుడికి న్యూ గినియా సాధారణంగా స్వాగతసత్కారాలు ఇవ్వదు. అయితే ప్రధాని మోడీకి అందుకు మినహాయింపు ఇచ్చారు.

ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (FIPIC) యొక్క మూడవ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోడీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో కూడా మోడీ భేటీ కానున్నారు.ఈ సమావేశానికి హాజరుకావడానికి 14 ఫసిఫిక్ ద్వీపదేశాలు సమ్మతించినందుకు మోడీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. FIPIC సమ్మిట్‌లో 14 దేశాల నాయకులు పాల్గొంటారు. అంతకుముందు ఈ 14 దేశాల్లో ఒకటైన ఫిజీలో 2014లో చివరిసారిగా ప్రధాని పర్యటించారు.

ఈ 14 పసిఫిక్ దేశాల్లో కుక్ దీవులు, ఫిజీ, కిరిబాటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నౌరు, నియు, పలావు, పాపువా న్యూ గినియా, సమోవా, సోలమన్ దీవులు, టోంగా, తువాలు మరియు వనాటు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here