పాట్నా రైల్వే స్టేషన్ స్కీన్ పై పోర్న్ వీడియో..

0
73

పాట్నా రైల్వేస్టేషన్ లో జుగుప్సాకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో స్టేషన్ రద్దీగా ఉన్న సమయంలో ఏకంగా స్టేషన్ స్రీన్ పై మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్లే అయింది. ఇది చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఇబ్బందికి గురయ్యారు. పాట్నా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టెలివిజన్ స్క్రీన్‌లపై ప్రకటనల స్థానంలో పోర్న్ క్లిప్ రావడంతో అన్ని రాష్ట్రాల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రయాణికులు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి ఫిర్యాదు చేయడంతో ఈ పోర్న్ క్లిప్ ప్రసారం ఆగిపోయింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు మూడు నిమిషాల పాటు పోర్న్ క్లిప్ ప్లే అయింది. ఇది చూసిన ప్రయాణికులు స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే స్టేషన్ స్ట్రీన్లపై యాడ్స్ ప్రసారం చేసే ఏజెన్సీ అయిన దత్తా కమ్యూనికేషన్ కు పోర్న్ క్లిప్ ఆపాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు చర్యలు ప్రారంభించారు. దత్తా కమ్యూనికేషన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు జరిమానా విధించింది. రైల్వే అధికారులు ఈ ఏజెన్సీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై రైల్వే శాఖ ప్రత్యేకంగా విచారణ జరుపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here