Pawan Kalyan: భారత్ గా మారనున్న ఇండియా.. పవర్ స్టార్ వ్యాఖ్యలు వైరల్

0
30

మన దేశాన్ని భరతుడు పాలించాడు.. అయన పేరు మీదనే ఈ దేశానికి భారత దేశం అనే పేరు వచ్చింది అని చరిత్ర పుటాలలో . లిఖించబడింది.. కాగా ఆంగ్లేయులు భారత దేశాన్ని ఆక్రమించిన తర్వాత భారత దేశం పేరుని ఇండియా గా మార్చారు.. దీనికి కారణం భారత దేశం సింధు నది పక్కన ఉంది.. ఈ నదిని ఆంగ్లంలో ఇండస్ రివర్ అంటారు.. ఆ ఇండస్ రివర్ పేరు మీదగా ఆనాడు బ్రిటీష్ వాళ్ళు భారత దేశం పేరుని ఇండియా గా మార్చడం జరిగింది అని అందరికి తెలిసిందే..

కాగా ఇప్పుడు ఈ ప్రస్తావన దేనికి వచిందనేగా మీ సందేహం.. మళ్ళీ ఇండియా పేరు భారత్ గా మారనుంది.. ప్రస్తుతం ఇదే వార్త దేశమంతా హల్చల్ చేస్తుంది.. దీనికి కారణం జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రింట్‌ చేయించారు.. దీనితో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం ప్రభలుతోంది..

విపక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి..కానీ ఈ నిర్ణయం సరైనదే అంటూ కొందరు సినీ మరియు క్రికెట్ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు.. ఈ నేపథ్యంలో స్టార్ హీరో మరియు జనసేన వ్యవస్థాపకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారత్ మీద గతంలో చేసిన వాఖ్యలు నెంటింట వైరల్ గా మారాయి..

వివరాలలోకి వెళ్తే గతంలో పవన్ తన అన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.. ఈ నేపథ్యంలో సినిమా గురించి ప్రస్తావించిన పవన్ ‘ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరు.. భారతదేశం అనేది మనది’ అంటూ వ్యాఖ్యానించారు పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌..

కాగా ప్రస్తుతం ఈ వ్యాఖలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..కేంద్ర ప్రభుత్వం తీరు పైన విమర్శలు జల్లు కురుస్తున్న ఈ సమయంలో పవన్ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తున్నారు.. కాగా ఈ వీడియో పైన నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు.. మరి ఆలస్యం ఎందుకు మీరు ఆ వీడియో ఒకసారి చూసేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here