కృష్ణం రాజు మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం

0
110

లెజండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు(83) మరణంపై యావత్ సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఓ గొప్ప నటుడు మరణించడంతో దేశవ్యాప్తంగా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్త విని ఒక్కసారిగా సినీలోకం, ఆయన అభిమానులు షాక్ అయ్యారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో కన్నుముశారు.

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ కేంద్రమంత్రి హైదరాబాద్ లో మృతి చెందడం పట్ల ప్రధాన మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ, కృష్ణం రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ పీఎం మోదీ ట్వీట్ చేశారు. ‘‘ రాబోయే తరాలు అతని సినీ నైపుణ్యం, సృజనాత్మకతను గుర్తుంచుకుంటాయి. సమాజసేవలో ముందున్నారు. రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర వేశారు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు మనల్ని విడిచిపెట్టడం చాలా బాధ కలిగించిందని.. తన నటనతో లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారని.. సమాజ అభివృద్ధికి కృషి చేశారని. ఆయన మరణం తెలుగు చిత్రసీమలో లోటును మిగిల్చిందంటూ ట్విట్టర్ ద్వారా అమిత్ షా సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఆయన మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సంతాపం వ్యక్తం చేశారు. సినీనటులు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here