ప్రముఖ దేశభక్తి గీతం ‘ సారే జహాన్ సే అచ్చా’ రాసిన పాకిస్తాన్ కవి మహ్మద్ ఇక్బాల్ సిలబస్ ను ఢిల్లీ యూనివర్సిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ యూనివర్శిటీ అకడమిక్ కౌన్సిల్ పాకిస్తాన్ జాతీయ కవి ముహమ్మద్ ఇక్బాల్‌పై ఉన్న అధ్యాయాన్ని పొలిటికల్ సైన్స్ సిలబస్ నుండి తొలగించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో ఆరవ సెమిస్టర్ లో ఉన్న ‘మోడ్రన్ ఇండియన్ పొలిటికల్ థాట్’ నుంచి మహ్మద్ ఇక్బాల్ సిలబస్ తొలగించనున్నారు.
అవిభక్త భారతదేశంలోని సియాల్ కోట్ లో 1877లో జన్మించాడు. ప్రస్తుతం సియాల్ కోట్ పాకిస్తాన్ లో ఉంది. మహ్మద్ అల్లామా ఇక్బాల్ పాకిస్తాన్ అనే దేశానికి సంబంధించిన ఆలోచనలు రేకెత్తించాడు. ఢిల్లీ యూనివర్సిటీ 1014వ అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుపై చర్చ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ మాట్లాడుతూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పునాది వేసిన వారు సిలబస్‌లో ఉండకూడదని అన్నారు. వైస్ ఛాన్సలర్ ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
పార్టీషియన్ స్టడీస్, హిందూ స్టడీస్, ట్రైబల్ స్టడీస్ ను సిలబస్ లో చేర్చాలని కౌన్సిల్ ఆమోదించింది. అయితే ఐదుగుర సభ్యులు ఉన్న కౌన్సిల్ ‘పార్టిషియన్ స్టడీస్’ను వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని ఏబీవీపీ స్వాగతించింది. మతోన్మాద కవి మహ్మద్ ఇక్బాల్ భారతదేశ విభజనకు కారణమయ్యాడని పేర్కొంది. ఇది ఆధునిక భారతదేశ ఆలోచన అని ప్రకటించింది. మహ్మద్ ఇక్బాన్ ను ‘ఫిలోసోఫికల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్’గా అభివర్ణిస్తారు. ముస్లింలీగ్ స్థాపించడానికి మహ్మద్ అలీజిన్నాకు సహకరించాడు. జిన్నాలాగే మహ్మద్ ఇక్బాల్ విభజనకు ఓ కారణం. ఇటీవల NCERT సిలబస్ నుండి ముఘల్స్, డార్విన్ సిద్ధాంతాన్ని తీసేశారు. ఏప్రిల్ నెలలో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన అధ్యాయాలను 12వ తరగతి సిలబస్ నుంచి తొలగించారు.