పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి..

0
220

పంజాబ్ సీఏం భగవంత్ మాన్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇప్పటికే తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నాడు. 48 ఏళ్ల మాన్ 32 ఏళ్ల గురుప్రీత్ కౌర్ ను రేపు చంఢీగడ్ లో వివాహం చేసుకోనున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యలో వివాహం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా వస్తున్నట్లు సమాచారం.

గురుప్రీత్ సింగ్ డాక్టర్. సాధారణ రైతు కుటుంబానికి చెందిన గురుప్రీత్ కుటుంబానికి, భగవంత్ మాన్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గురుప్రీత్ కౌర్ కుటుంబం పంజాబ్ లోని కురక్షేత్ర పెహ్వా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గురుప్రీత్ కౌర్ తండ్రి గురుప్రీత్ కౌర్ తండ్రి ఇందర్‌జిత్ సింగ్ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వారు. తల్లి మాతా రాజ్ కౌర్ గృహిణి.

గతంలో భగవంత్ మాన్ కు ఇంద్రప్రీత్ కౌర్ తో వివాహం జరిగింది. అయితే ఆరేళ్ల క్రితం వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. భగవంత్ మాన్ కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాజీ భార్య ఇంద్రప్రీత్ కౌర్, తన ఇద్దరు పిల్లలతో యూఎస్ఏలో ఉంటోంది. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల్లో ఆప్ అఖండ విజయం సాధించింది. ఈ ఏడాది మార్చి 16న సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఇంద్రజీత్ కౌర్, ఇద్దరు పిల్లలు కూడా పంజాబ్ వచ్చారు.

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here