”బిల్కిస్ బానో” కేసులో దోషుల విడుదలపై సుప్రీంలో పిల్

0
122

2002లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లలో బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు దుండగులు. ఆ టైంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు . 15ఏళ్లు కారాగారంలోనే ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీరి విడుదలకు గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో.. గోద్రా సబ్‌ జైలు నుంచి విడుదల చేశారు అధికారులు. అంతేకాదు వీరికి పెద్ద ఎత్తున ఓ సంస్థ స్వాగతాలు పలకడం, మిఠాయిలు పంచుకోవడం కూడా వివాదమైంది. దోషుల విడుదలపై జాతీయస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. బిల్కిస్ సహా ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వ తీరుపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, దోషుల విడుదల ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నారు. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆ దోషులకు రెమిషన్ మంజూరు చేసి.. విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఓ పిటిషన్ దాఖలైంది. మహిళా హక్కుల కార్యకర్తలు ఈ పిటిషన్‌ వేశారు.

బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు క్షమాపణలు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ అంగీకరించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, జర్నలిస్టు రేవతి లాల్, సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసని.. దోషులకు రెమిషన్ మంజూరు వెనక ఉన్న నిబంధనలను మాత్రమే తాము సవాలు చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం అంగీకరించింది.

గుజరాత్ ప్రభుత్వ రిమిషన్ పాలసీ ప్రకారం బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేసే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత ఆగస్టు 19న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.జీవిత ఖైదు పడిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15న విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here