నిత్యం ఎంతోమంది ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణిస్తుంటారు.. ఆ ప్రయాణాలలో కొన్ని సార్లు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటుంటాయి.. ప్రమాదం జరిగింది అనగానే ఎవరికైనా ఏమైనా అయిందా అని అడుగుతుంటాం..ఎందుకంటే ప్రమాదంలో ప్రాణాలు కూడా పోవచ్చు..కానీ కొన్నిసార్లు ఆ దేవుడే రక్షించాడా అన్నట్లు అనిపిస్తుంది.. ఎందుకంటే ప్రాణాలను కబళించాల్సిన ప్రమాదం.. ప్రాణాలని కాపాడిమప్పుడు అలా అనిపించడం సహజం..
ప్రమాదమే ప్రాణాలను కాపాడడం ఎప్పుడైనా చూసారా? ప్రమాదం ఏంటి ప్రాణాలను కాపాడడం ఏంటి అనుకుంటున్నారా.. అవును ఒక ప్రమాదం ఎంతోమంది ప్రాణాలను కాపాడింది..అందుకే అంటారు పెద్దలు భూమి మీద నూకలుంటే యమలోకం కి వెళ్లిన తిరిగి రావొచ్చని.. ఈ మాట నిజం అని ఈ సంఘటన మరోసారి నిరూపించింది..
వివరాలలోకి వెళ్తే.. ఓ RTC బస్సు శ్రీశైలం తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడుకు బయలుదేరింది.. పెట్లూరువారిపాలెం – ఉప్పలపాడు మధ్యకి వచ్చేసరికి బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది.. దీనితో ఆ బస్సు ఎవరు ఊహించని విధంగా నరసరావుపేట వైపు వెళ్తున్న లారీని డీ కొన్నది.. దీనితో పెనుప్రమాదం తప్పింది.. లేకపోతే భారీ ప్రాణనష్టం చూడవలసి వచ్చేదని ప్రయాణికులు తెలిపారు..
కాగా ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదు.. ట్రాన్స్‌పోర్ట్ లారీ ప్రమాదం రూపంలో బస్సును ఢీకొనడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులనుకాపాడినట్లు అయ్యింది.. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన లారీ డ్రైవర్‌కు గానీ, బస్సు డ్రైవర్‌కి గానీ ఎటువంటి గాయాలు కాలేదు.. అయితే, లారీ ముందు భాగం కొంతమేర దెబ్బతిందని చెబుతున్నారు ప్రత్యక్షసాక్షలు..