Biggboss season 7: సీజన్ 7 ప్రారంభం.. బిగ్ బాస్ ఇంట్లో షకీలా

0
19

ప్రేక్షకులని అలరిస్తున్న ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో బిగ్ బాస్ ఒకటి.. ఈ కార్యక్రమం ప్రేక్షుకులని ఎంతగా ఆకట్టుకున్నదంటే.. ఈ కార్యక్రమం వచ్చే సమయంలో ఇంకా వేరే ఏ కార్యక్రమాన్ని చూడనంతగా ప్రజాధారణ పొందింది.. ఇప్పటికే 6 సీజన్లు పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం ఎప్పుడు 7 సీజన్ లోను అడుపెట్టింది.. తాజాగ సీజన్ 7 గ్రాండ్ గ ప్రారంభమైనది .. కాగా ఈ సీజన్లో అలనాటి నటి షకీలా కూడా ఎంట్రీ ఇచ్చారు..

మలయాళం షకీలాకు మంచి క్రేజ్ ఉంది.. నీలి చిత్రాలలో నటించిన షకీలా కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు.. కాగా తాజాగా ఆమె బిగ్ బాస్ 7 ద్వారా తన సెకండ్ ఇండింగ్స్ ని ప్రారంభించారు.. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు తన గురించి తన జీవితం లో ఎదురుకున్న సవాళ్ల గురించి ఆమె వెల్లడిస్తూ.. నా పేరు సి. షకీలా జాన్.. మా అమ్మది నెల్లూరు మా నాన్నది చెన్నై.. నేను 10 వ తరగతి ఫెయిల్ అయ్యాను.. దీనితో మా నాన్న నన్ను కొట్టేవారు..

మాకు తెలిసిన మేకప్ మ్యాన్ నాకు సినిమాలలోకి రావాల్సిందిగా సూచించారు.. ఆయన ద్వారా ఆడిషన్స్ కి వెళ్లగా సిల్క్ స్మిత సిట్టర్ క్యారెక్టర్ ఇచ్చారు.. తరువాత నన్ను వస్త్రాలను తీసేయాల్సిందిగా సూచించారు.. ఈ విషయం మా నాన్న కి తెలిపాను అయన చాల తేలికగా చెయ్యను అని చెప్పమన్నారు.. నా కుటుంబం నన్ను మనిషిలా చూడలేదు.. డబ్బులు సంపాదించే యంత్రంగానే చూసారు..వాళ్లకి కావాల్సిందల్లా నా సంపాదన..

నేను సొంతంగా ఇల్లు తీసుకోవాలి అనుకున్న అది కూడా వాళ్లకి ఇష్టంలేదు ఎందుకంటే నేను సపరేట్ ఉంటె వాళ్లకి నా సంపాదన దక్కదని భయం.. దీనితో మా అక్క నా డబ్బులు దాచిపెడతానని తీసుకుంది..ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంది అంటూ తన కుటుంబం చేసిన మోసాన్ని తెలియజేసారు.. అనంతరం వేదిక పైకి వచ్చిన ఆమెని నాగార్జున పలకరించారు.. అంతరం ఆమె ప్రేమగా పెంచుకుంటున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ తంగం, షాషా ని వేదికపైకి ఆహ్వానించారు.. వాళ్ళని చూడగానే షకీలా భావోద్వేగానికి గురికాగా.. ఆమెను నాగార్జున ఓదార్చారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here