నిద్రపోయి 5 లక్షలు సంపాదించిన యువతి..!

0
115

డబ్బులు వూరికే రావు అనే మాటలు కూడా వింటుంటాము. అంటే నెలలో రోజుకు సుమారు 10 గంటలైనా శ్రమ పడి, కంటిదనిండా నిద్ర కూడా లేకుండా పనిచేయాలి. దాని ద్వారా శారీరకంగా మానసికంగా అలసిపోతాము కూడా.. అంతేకాదు.. నెల అంతా కష్టపడితే గానీ జీతం చేతిరావడం అదే గొప్పగా ఫీలవుతాము. నెలఅంతా కష్టపడింది ఆరోజుతో కొంత మంది హమ్మయ్య అనుకుంటే మరి కొందరికి ఇంతేనా అనిపించేలా వుంటుంది. కానీ కోల్‌కతా కు చెందిన త్రిపర్ణా చక్రవర్తి మంచం దిగకుండా ఐదు లక్షల సంపాదించింది. ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా. మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం.

వేక్‌ఫిట్‌.. ఇదొక పరుపుల తయారీ సంస్థ. నిద్రను ప్రోత్సహించడమే ముఖ్యోద్దేశంగా ‘స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌’ పేరుతో ఏటా ఓ పోటీని నిర్వహిస్తోంది. ఇందుకోసం లక్షల కొద్దీ అందిన దరఖాస్తుల్ని పరిశీలించి.. 15 మందిని ఇంటర్న్స్‌గా ఎంపిక చేస్తారు. వీరికి ఒక పరుపుతో పాటు, స్లీప్‌ ట్రాకర్‌ అందిస్తారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో ఎవరింట్లో వాళ్లు వరుసగా 100 రోజులు 9 గంటల చొప్పున నిద్రించాలి. ఇలా వాళ్ల నిద్ర నాణ్యతను పరిశీలించి.. నలుగురిని తుది రౌండ్‌కు ఎంపిక చేశారు. వీరిలో ఒకరిని విజేతగా ఎంపికచేస్తారు. వాళ్ల నిద్ర నాణ్యతను బట్టి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు నగదు బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని కల్పించిందీ సంస్థ. ఈ క్రమంలోనే గతేడాది నిర్వహించిన రెండో సీజన్‌లో 95 శాతం నాణ్యతను సాధించి విజేతగా నిలిచింది కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి. తద్వారా రూ. 5 లక్షల నగదు బహుమతి అందుకుంది. ‘భారత తొలి స్లీప్‌ ఛాంపియన్‌’గా నిలిచింది. ఇక మిగతా ముగ్గురు ఫైనలిస్టులకు రూ. లక్ష చొప్పున అందజేశారు.

ఎంపికైనా త్రిపర్ణా చక్రవర్తి మాట్లాడుతూ.. తనకున్న అతి నిద్ర అలవాటే బహుశా ఈ పోటీలో నెగ్గేలా చేసిందేమో అంటోందీ స్లీప్‌ లవర్‌. తనకు పోటీ కోసం బలవంతంగా నిద్రపోవడం నేర్చుకున్నానేమో అనుకోకండి.. ఎందుకంటే నేను స్కూల్లో, కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడూ క్లాస్‌లోనే నిద్రపోయేదాన్ని, గణిత పరీక్ష అంటే చాలు నిద్రొచ్చేసేది. ఓసారి శాట్​ పరీక్షలో నిద్రపోతే ఇన్విజిలేటర్‌ నాకు టీ తెప్పించి ఇచ్చారు. అందుకనే.. ఇలా నాకు చిన్నప్పట్నుంచి ఉన్న అతి నిద్ర అలవాటు కారణంగా తరచూ స్కూల్‌ బస్‌ మిస్సయ్యేదాన్ని. దాంతో చాలా సార్లు నాన్న నన్ను బైక్‌పై తీసుకెళ్లి బస్సెక్కించేవారు. బస్సులో ఎక్కువగా నిద్ర పోయే వారిని బద్ధకస్తుల కింద లెక్కకడుతుంటారు. అయితే.. నిజానికి మనకు కావాల్సినంత సమయం నిద్రకు కేటాయించడం మన బాధ్యత, ఇది మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. అయితే ఇలా బారెడు పొద్దెక్కే దాకా నిద్ర పోవడం వల్ల అదృష్టం కూడా కలిసి రాదని చాలామంది అనేవారు. అలాంటివారే ఇప్పుడు నన్ను చూసి స్ఫూర్తి పొందారని చెప్పుకొచ్చారు. నేను ప్రశాంతంగా నిద్ర పోవడానికి ప్రయత్నిస్తున్నానని అంటోందీ స్లీపింగ్‌ బ్యూటీ. ఒక మొత్తానికి భలే ఉంది కదూ.. ఎంచక్కా అటు నిద్రకు నిద్ర, ఇటు డబ్బుకు డబ్బు, బోలెడంత ఆరోగ్యం కూడా అంటూ ఫన్నీగా చెప్తు నాలాగా నిద్రపోండని సూచించి ఈ అమ్మడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here