ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలం.. రాంగ్ ఆర్బిట్ లో శాటిలైట్లు

0
136

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలం అయింది. ఈ విషయాన్ని ఇస్రో స్వయంగా ప్రకటించింది. తొలిసారి ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం విఫలం అయింది. రాకెట్ అన్ని దశల్లో మంచిగానే పనిచేసినా.. ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశింపచేసే సమయంలో తప్పుడు కక్ష్యలో ప్రవేశపెట్టడంతో శాటిలైట్లతో గ్రౌండ్ స్టేషన్లకు కమ్యూనికేషన్ నిలిచిపోయింది. అయితే మొదటి మూడు దశలు సక్సెస్ ఫుల్ గా సాగాయి. అయితే టెర్మినల్ స్టేజీలో మాత్రం ఉపగ్రహాలతో గ్రౌండ్ స్టేషన్ కు సంబంధాలు తెగిపోయాయి. మూడో దశ తరువాత ఈఓఎస్ 2, ఆజాదీ ఉపగ్రహాలను కక్ష్య లోకి విడిచిపెట్టింది. అయితే ఆర్బిట్ లోకి చేరిన తర్వాత ఉపగ్రహాల నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. చివరి దశలో ప్రయోగం విఫలం అయినట్లు తెలిసింది.

తాజాగా ఈ ప్రయోగం ఫెయిల్ అయినట్లు ఇస్రో ప్రకటించింది. అయితే అనుకున్న ఆర్బిట్ కన్న తప్పుడు ఆర్బిట్ లో శాటిలైన్లను ప్రవేశపెట్టడంతో ప్రయోగం విఫలం అయింది. ఎస్ఎస్ఎల్వీ డీ1 చిన్న రాకెట్ ద్వారా చరిత్ర సృష్టించాలనుకున్న ఇస్రోకు చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈఓఎస్ 2, ఆజాదీ ఉపగ్రహాలను 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యకు బదులు శాటిలైట్లను 356 కిలోమీటర్లు x 76 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచింది. అయితే టెర్మినల్ స్టేజ్ లో సెన్సార్ వైఫల్యాన్ని గుర్తించారు. వైఫల్యానికి కారణాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.

ఈఓఎస్ శాటిలైట్( భూ పరిశీలన ఉపగ్రహం)ని స్పేస్ కిడ్జ్ ఇండియా విద్యార్థులు అభివృద్ధి చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్తులకు అంతరిక్షంపై మరింత అవగాహన పెంచేందుకు ఈ శాలిలైట్ ని డెవలప్ చేశారు. ఇక ఆజాదీ శాట్ ని 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 750 మంది పాఠశాల విద్యార్థులు రూపొందించారు.

తాజాగా ఈ రోజు ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్ పీఎస్ఎల్వీ రాకెట్ కన్నా పొడవులో 10 మీటర్ల తక్కువగా.. వ్యాసంలో 2.8 మీటర్లు తక్కువగా ఉన్న శాలిలైట్ లాంచింగ్ వెహికిల్. ఇప్పటి వరకు పీఎస్ఎల్వీ ( పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) ద్వారా అనేక ఉపగ్రహాలను ఇస్రో పంపించింది. ఇస్రో గెలుపు గుర్రంగా పీఎస్ఎల్వీకి పేరుంది. దీంతో పాటు జీఎస్ఎల్వీ( జియో సింక్రనస్ లాంచింగ్ వెహికిల్) ద్వారా భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపిస్తోంది. తాజాగా ఎస్ఎస్ఎల్వీ ఇస్రోకు తొలి ప్రయోగం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here