స్మోకింగ్ ఏజ్ పెంచాలన్న పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం అన్నదంటే..

0
108

స్మోకింగ్ వయసును పెంచాలని ఇద్దరు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్మోకింగ్ వయసు పెంచాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ను శుక్రవారం కొట్టి వేసింది. ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసి పిటిషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ ఖే కౌల్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. స్మోకింగ్ ఏజ్ ను 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలని దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. దీంతో పాటు విద్యా, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, ప్రార్థనా స్థలాల సమీపంలో వదులుగా ఉన్న సిగరేట్ల అమ్మకాలను నిషేధించడంతో పాటు వాణిజ్య ప్రదేశాల నుంచి స్మోకింగ్ జోన్ లను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. శుభమ్ అవస్థి, సప్త రిషి మిశ్రా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారించింది.

అయితే ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులకు అక్షింతలు వేసింది. మీకు పబ్లిసిటీ కావాలంటే మంచి కేసులను వాదించండి.. పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్లను దాఖలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సమయంలో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు పొగాకు వల్ల వచ్చే దుష్ప్రరిణామాలను సుప్రీం కోర్టుకు విన్నవించారు. డబ్ల్యూహెచ్ఓ 2018 ఫ్యాక్స్ షీట్ ప్రకారం.. ఇండియాలో పొగాకు వల్ల యువకులు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని.. దేశంలో 90 లక్షల మంది అంటే దేశ జనాభాలో 9.5 శాతం మంది పొగాకు వల్ల మరణిస్తున్నారని కోర్టుకు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here