ముకేష్ అంబానీ ఫ్యామిలీ సెక్యూరిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

0
96

పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఫ్యామిలీకి సెక్యూరిటీ కొనసాగింపుకు కేంద్రానికి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. శుక్రవారం ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గతంలో త్రిపుర హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ముకేష్ అంబానీ ఫ్యామిలీకి భద్రత కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంబానీ కుటుంబ భద్రతకు సంబంధించి దాఖలైన కేసును కొట్టివేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై గతంలో త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. శుక్రవారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ట మురారి, హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి భద్రత కొనసాగించవచ్చని ఆదేశాలు ఇచ్చింది.గతంలో ముకేష్ అంబానీ సెక్యూరిటీపై త్రిపుర హైకోర్టులో పిల్ దాఖలు అయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును గత నెల చివర్లో సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం తరుపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. త్రిపురలో పిటిషన్ దాఖలు చేసిన బికాష్ సాహా అనే వ్యక్తికి ముకేష్ అంబానీ సెక్యూరిటీకి ఎలాంటి సంబంధం లేదని వాదించారు.

గతంలో త్రిపుర హైకోర్ట్ ఈ విషయంపై మే 31, జూన్ 21న మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ముకేష్ అంబానీ, అతని భార్య, పిల్లలకు ఎలాంటి ప్రమాదం ఉంది అనే విషయంపై కేంద్ర హోంశాఖ వద్ద ఉన్న పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ముకేష్ అంబానీ కుటుంబ భద్రతపై క్లారిటీ ఇస్తూ తీర్పు చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, సుప్రీంకోర్టు కేసును రద్దు చేసింది. భారతదేశంలో, ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతకు కేంద్ర భారీ భద్రతను కల్పిస్తోంది. అంబానీకి జెడ్+ సెక్యూరిటీని ఉంది. అతని భార్య నీతా అంబానీకి వై + సెక్యూరిటీ ఉంది. జెడ్ + సెక్యూరిటీని భారతదేశంలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి కల్పిస్తారు. దీని కింద మొత్తం 50-55 సీఆర్పీఎస్ సాయుధ కమాండోలు 24 గంటల పాటూ కాపలాగా ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here