వీడేం సారు.. ఐదేళ్ల బాలుడిపై ఇంత దారుణమా..?

0
492

ఐదేళ్ల బాలుడిపై కిరాతంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు.. కర్రతో కొట్టి, చెంపలు వాయించి, పిడిగుద్దులు గుద్ది, కిందపడిపోయినా వదలకుండా కనీసం కనికరం లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తూ.. ఐదేళ్ల బాలుడిని చిత్ర హింసలకు గురిచేశాడు.. ఆ బాలుడు స్పృహతప్పి పడిపోయే వరకు వదలకుండా దారుణంగా ప్రవర్తించాడు.. బీహార్‌లో జరిగిన ఈ దారుణమైన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

పాట్నాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీర్ ఒరియా ప్రాంతంలో జయ పేరుతో కోచింగ్‌ సెంటర్‌ నడుస్తోంది.. ఆ సెంటర్‌లో చోటు అనే యువకుడు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా.. తాజాగా, ఓ ఐదేళ్ల బాలుడి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.. సరిగ్గా చదవడం లేదన్న కారణంతో విచక్షణారహితంగా ప్రవర్తించాడు.. ఆ బాలుడి పిరుదులపై కర్రతో దారుణంగా కొట్టాడు.. ఆ బాలుడు ఏడుస్తున్నా.. కొట్టొద్దని ప్రాదేయపడినా కనికరం చూపలేదు.. ఆ కర్ర విరిగేదాగా కొట్టాడు.. అంతటితో ఆగకుండా చెంపలు వాయించాడు.. ఆ తర్వాత బాలుడిపై పిడిగుద్దలతో విరిచుకుపడ్డాడు.. నెలపై పడిపోయినా వదలకుండా.. గట్టిగా అరిస్తూ చిత్ర హింసలకు గురిచేశాడు.. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడంటే.. ఆ ఉపాధ్యాయుడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు.. ఇక, సమాచారం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రలు.. వెంటనే ఆ కోచింగ్‌ సెంటర్‌కు చేరుకుని బాలుడిని ఆస్పత్రికి తరలించారు.. ఆ తర్వాత నిందితుడిపై దాడి చేశారు.. వారి దాడిలో నిందితుడైన టీచర్‌ చోటుకు కూడా తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది.. అయితే, బాలుడి పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆ వీడియోను అక్కడ పనిచేసే ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. వైరల్‌గా మారిపోయింది. నెటిజన్లు తీవ్రస్థాయిలో ఉపాధ్యాయుడిపై మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here