మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. తాజాగా శుక్రవారం రోజు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలోని అన్ని జిల్లాల శివసేన అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఏక్ నాథ్ షిండే మోసం చేశాడని ఆరోపించారు. ఏక్ నాథ్ షిండేకు అత్యంత కీలకమైన అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇవ్వడంతో పాటు ఆయన కొడుకుకు ఎంపీ సీటు కేటాయించామని.. ఇంత చేసినా పార్టీని మోసం చేశారని వాపోయారు. నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని మీరు కోరుకుంటే, నేను దానిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని..నేను పదవికి, కుర్చీకి అతుక్కుపోయే వ్యక్తిని కాదన్నారు ఉద్ధవ్ ఠాక్రే
ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే గ్రూపులో చేరారు. ఇప్పటి వరకు 39 మంది శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేఖంగా ఏక్ నాథ్ షిండే క్యాంప్ లో చేరారు. ప్రస్తుతం శివసేన దగ్గర 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు ఉద్ధవ్ ఠాక్రే పలు జిల్లాల సేన అధ్యక్షులతో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఏర్పడింది. శివసేన కార్యకర్తలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తిరుగుబాటు చేసి పలువురు ఎమ్మెల్యే కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు శివసైనికులు. తిరుగుబాటు సేన ఎమ్మెల్యేల పోస్టర్లు, బ్యానర్లను తీసివేసి వారికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో అన్ని పోలీస్ స్టేషన్లలో హై అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ముంబై నగరంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. శివసైనికులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావచ్చనే సమాచారంతో పోలీసులు అంతా అప్రమత్తంగా ఉన్నారు.
#WATCH | Maharashtra | Office of rebel MLA Mangesh Kudalkar in Kurla vandalised allegedly by Shiv Sena workers today pic.twitter.com/RhVYGJVw5X
— ANI (@ANI) June 24, 2022