ఎవర్రా మీరంతా…చికెన్ కర్రీ ఆర్డర్ ఇస్తే ఎలుక కర్రీ ఇచ్చారేంట్రా…!

0
41

వారమంతా ఇంట్లో వండింది తిన్న వారానికి ఒక్కసారైనా కుటుంభంతో కలిసి సరదాగా రెస్టారెంట్స్ కి వెళ్లి తింటుంటారు చాలామంది… ఇంకా బ్యాచిలర్స్ గురించి చెప్పనవసరంలేదు వాళ్ళు రుచి చూడని హోటల్స్ మరియు రెస్టారెంట్స్ ఉండవు.. ఇంకా చెప్పాలంటే కొన్ని రెస్టారెంట్స్ కి ఫాన్స్ కూడా ఉంటారు… మరి అలాంటి ఫేమస్ రెస్టారెంట్ నిర్లక్ష్యంగా ఉంటె… ఇండియన్ ఆర్డర్ లో చైనీస్ డిష్ సర్వ్ చేస్తే… చైనీస్ అంటే మళ్ళీ నూడుల్స్, మంచూరియ లాంటివి కాదు… బోధింక కబ్బాబ్ ఎలక కర్రీ ఇలాంటివి సర్వ్ చేస్తే ఆ ఆర్డర్ ఇచ్చిన పర్సన్ పరిస్థితి ఎలా ఉంటుంది… ఆహారంలో బోధింకలు,బళ్ళులు వచ్చిన సంఘటనలు కోకొల్లలు అలాంటి సంఘటనే ఇప్పుడు మహారాష్ట్ర రాజధాని నగరమైన ముంబైలో చోటు చేసుకుంది…ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ముంబైలోని బాద్రాలో ఉన్న ఓ ఫేమస్ హోటల్‌కు వెళ్లి చికెన్ కర్రీ, మటన్ థాలీ ఆర్డర్ ఇవ్వగా కొద్దిసేపటికి హోటల్ సిబ్బంది వాళ్లకి వేడి వేడి ఫుడ్ తీసుకుని వచ్చి వడ్డించారు… ఆకలితో ఉన్న ఆ యువకులు ఆ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం ప్రారంభించారు… అయితే అందులో ఒక వ్యక్తికి తింటుండగా.. ఏదో తేడాగా అనిపించింది. వెంటనే అది ఏంటని పరిశీలించి అది ఎలుకకు సంబంధించిన మాంసం ముక్క అని గుర్తించాడు. దీంతో వెంటనే హోటల్ సిబ్బందిని పిలిచి వారిద్దరు ప్రశ్నించారు. దానికి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వారికి మరింత కోపం వచ్చింది. దీంతో వెంటనే బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసుకుని రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆ హోటల్ లోని ఆహారాన్ని పరీక్షించి ఆ యువకులు ఆర్డర్ చేసిన చికెన్ కర్రీని కూడా స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి పంపించారు. అనంతరం ఆ హోటల్ మేనేజర్, చెఫ్‌ను అరెస్ట్ చేసినట్లు బాంద్రా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వివరించారు. అయితే చికెన్ కర్రీలో ఎలుక అవశేషాలు వచ్చాయని ఆ ఇద్దరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన హోటల్ యాజమాన్యం తాము 22 ఏళ్లుగా హోటల్‌ను నడిపిస్తున్నామని.. ఇలాంటి సంఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని వెల్లడించారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులకు చికెన్ కర్రీ వడ్డించిన సమయంలో తాను హోటల్‌లో లేనని.. ఈ విషయం తమ సిబ్బంది తెలియజేయడంతో వెంటనే అక్కడికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో హోటల్ మేనేజర్ చెప్పారు. డబ్బులు కోసమే ఆ యువకులు ఈ నిందారోపణ చేస్తున్నారని…ఇందులో ఎలాంటి నిజం లేదని.. అసలు వాళ్ళు హోటల్ కి వచ్చినప్పుడే బాగా తాగేసి ఉన్నట్లు తమ హోటల్ సిబ్బంది చెప్పారని మేనేజర్ వ్యాఖ్యానించారు…కానీ మేనేజర్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన పోలీసులు మేనేజర్ ని, చెఫ్ ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోగా వాళ్ళు బెయిల్ పైన బయటకి వచ్చారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here