ఇద్దరు అమ్మాయిల లవ్.. లింగమార్పిడి.. స్టోరీలో బిగ్ ట్విస్ట్..

0
342

ఈ మధ్య కాలంలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించకోవడం, అబ్బాయిలు ప్రేమించుకోవడం చూస్తున్నాం. స్వలింగ సంపర్కులు మారి పెళ్లి చేసుకున్నారనే వార్తలు వింటున్నాం. అయితే తాజాగా యూపీలో జరిగిన ఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ కథలో ఊహించని ట్విస్టులు ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో ఒకరు అబ్బాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకన్నారు. చివరకు అబ్బాయిగా మారిన అమ్మాయి తనకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకెక్కింది.

వివారాల్లోకి వెళితే.. యూపీలో ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. సోనమ్ అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదే సమయంలో సనా అనే మరో యువతి సోనమ్ ఇంట్లోకి పేయింగ్ గెస్ట్ గా వచ్చింది. వీరిద్దరి మధ్య స్నేహం కుదిరి ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రేమ ఏర్పడింది. నాలుగు నెలల్లోనే ఇద్దరూ సహజీవనం చేసే వరకు వెళ్లింది. సనా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమెకు బదిలీ కావడంతో 2017 ఆగస్టు 10న తనకు కేటాయించిన క్వార్టర్స్ కు వెళ్లింది. అయితే సనా ఎడబాటును తట్టుకోలేక సోనమ్ నాలుగు రోజులకే సనా దగ్గరకు వెళ్లిపోయింది.

ఇదిలా ఉంటే కొన్నాళ్లకు సనాను నువ్వు మగాడిలా మారాలని సోనమ్ ప్రతిపాదన పెట్టింది. చివరకు ఒప్పించింది. ఇద్దరూ కలిసి ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రికి వెళ్లారు. సర్జరీ తరువాత సనా తన పేరును 2020 జూన్ 22న సోహైల్ ఖాన్ గా మార్చుకుంది. పైగా సర్జరీ సమయంలో సనాకు భార్యని అని సోనమ్ సంతకాలు కూడా చేసింది.

ఈ కథ తర్వాత ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సోమన్ కు ఓ ఆస్పత్రిలో జాబ్ వచ్చింది. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత సోనమ్ తీరులో మార్పు రావడాన్ని సనా గమనించింది. సోనమ్ తన ఆస్పత్రిలో పనిచేస్తున్న జ్ఞాన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. సోహైల్ గా మారిన సనాను విడిచివెళ్లిపోయింది సోనమ్. చివరకు సోహైల్ తనపై అత్యాచారం చేశాడని సోమన్ పోలీస్ కేసు కూడా పెట్టింద. పోలీసులు ఎదుట సోహైల్ గా మారిన సనా తన గోడును వెళ్లబోసుకుంది. అయినా లాభం లేకపోవడంతో తనకు న్యాయం చేయాలని కోర్టు కెక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here