ఆ కుటుంబాన్ని పాము పగబట్టిందా అన్న విధంగా రెండు రోజుల వ్యవధిలోనే అన్నా తమ్ముడు మరణించారు. పాము కాటులో మరణించిన అన్న అంత్యక్రియలకు వచ్చిన తమ్ముడు కూడా పాము కాటుకే గురై మరణించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం భవానీ పూర్ లో బుధవారం చోటు చేసుకుంది. లూథియానా నుంచి అన్న కడసారి చూపు కోసం వచ్చిన గోవింద్ మిషారా అనే వ్యక్తి అన్న చనిపోయిన విధంగానే పాము కాటులో మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
Read Also: NTR: మేనత్త కుటుంబాన్ని పరామర్శించిన ఎన్టీఆర్.. తమ్ముడితో పాటే అన్నకూడా
గోవింద్ మిషారా(22) అన్న అరవింద్ మిశ్రా(38) పాము కాటుకు గురై మరణించాడు. దీంతో గోవింద్ మిషారా అన్న అంత్యక్రియలకు హాజరయ్యాడు. బుధవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. గోవింద్ మిషారా నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లోకి దూరిన పాము అతన్ని కాటేసింది. అయితే పాము కాటుకు గురైన గోవింద్ మిషారాను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించే సమయానికే గోవింద్ మిషారా పరిస్థితి విషమించింది. దీంతో చికిత్స పొందుతూ గోవింద్ మిషారా మరణించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక వైద్య, పరిపాలన సిబ్బంది గ్రామాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కైలాష్ నాథ్ శుక్లా కూడా కుటుంబ సభ్యులను పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.