లండన్ లో ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్ కటౌట్

0
71

కేసీఆర్‌ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న యూకే ఎన్నారైలు ఆకాంక్షించారు. కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి రావాలని, వారి నూతన జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు యూకే ఎన్నారైలు తెలిపారు. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద సమావేశమైన ఎన్నారైలు కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. యూకే లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు సైతం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి భారత దేశానికి నాయకత్వం వహించి దేశ గతిని మార్చాలని కోరారు.

నేడు దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తుందని , రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు , జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలంటే కేసీఆర్‌ వల్లే సాధ్యమని ఎన్నారైలు తెలిపారు. “దేశ్ కి నేత కెసిఆర్” అంటూ భారీ కెసిఆర్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం తో పాటు ఎన్నారైలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here