ఆ యూనివర్సిటీలో విద్యార్థినులకు మాతృత్వ సెలవులు

0
650

దేశంలో తొలిసారిగా ఓ యూనివర్సిటీ విద్యార్థినులకు మాతృత్వ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. పెళ్లి, పిల్లలు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినులను దృష్టిలో పెట్టుకుని కేరళ రాష్ట్రం కొట్టాయంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళలకు మాత్రమే మాతృత్వ సెలవులను ఇస్తుంటారు. అయితే తొలిసారిగా ఓ యూనివర్సిటీ ప్రెగ్నెన్సీతో ఉన్న విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

18 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న డిగ్రీ, పీజీ విద్యార్థినులకు 60 రోజలు పాటు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. దీని వల్ల వారు ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువును కొనసాగించవచ్చని తెలిపింది. వైస్ ఛాన్సలర్ సీటీ అరవింద్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ. ప్రసూతి సెలవులను ప్రసవానికి ముందు కానీ తర్వాత కానీ తీసుకోవచ్చని.. మొదటి లేదా రెండో గర్భధారణకు మాత్రమే ఇది వర్తిస్తుందని.. కోర్సు వ్యవధిలో ఒకసారి మాత్రమే ప్రసూతి సెలవులను మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది యూనివర్సిటీ.

ఇక అబార్షన్, ట్యూబెక్టబీ తదితర విషయాల్లో 14 రోజుల సెలవులు మంజూరు చేయబడుతాయని పేర్కొంది. ప్రెగ్నెన్సీ కారణంగా విద్యార్థినుల చదువులు ప్రభావితం కావద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సెమిస్టర్ మధ్యలో ప్రసూతి సెలవులు తీసుకున్న వారు పరీక్షలు రాసుకునేందుకు, తర్వాతి సెమిస్టర్ వెళ్లేందుకు అనుమతించబడుతారు. దీంతో వారు సెమిస్టర్ కోల్పోయే అవకాశం ఉండదని యూనివర్సిటీ పేర్కొంది. ప్రసూతి సెలవులు పొందేందుకు, సెలవు ప్రారంభానికి మూడు రోజుల ముందు దరఖాస్తుతో పాటు రిజిస్టర్డ్ డాక్టర్ మెడికల్ సర్టిఫికేట్ అందించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here