Warangal: క్రేజీ బాబులకు బాడ్ న్యూస్.. తల్వార్ ఊపితే కేస్

0
32

కాలం మారింది అని చెప్పడానికి ప్రస్తుతం ఉన్న యువతే ఉదాహరణ అంటారు చాలామంది పెద్దవాళ్ళు.. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అంత విచిత్రంగా ఉంటాయి మరి.. యువత ఏది చేసిన ట్రెండీగా ఉండాలి అనుకుంటారు.. అలానే చేస్తుంటారు.. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలలో యువత చేసే వింతలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.. బర్త్డే కేక్ ని పెద్ద కత్తితో కోయడం.. తల్వార్ తో ఉన్న పిక్స్ ని ఫ్లెక్సీ గ వేయించడం.. రహదారుల్లో బైక్ పైన కేక్ కటింగ్ ఇలా కొత్తగా చేస్తుంటారు.. కానీ ఇకపైన ఆ ఆటలు సాగవు అంటున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్..

గత కొంతకాలంగా వరంగల్ కమిషన్ రేటు పదిలో తల్వార్ (కత్తులు) సంస్కృతి పైన ద్రుష్టి పెట్టారు సీపీ.. కొందరు వ్యక్తులు కత్తులతో యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నారు.. ఈమధ్య మధు అనే వ్యక్తి మద్యం కోసం షాప్ అతన్ని బెద్దిరించడం, పోలీసులని ఫుల్ బాటిల్ ఇస్తేనే స్టేషన్ కి వస్తాననడం అందరికి తెలిసిందే..

కాగా తాజాగా హైవే పైన ద్విచక్ర వాహనాల్ని పెట్టి పుట్టినరోజులని కేక్ కట్ చేపిస్తూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తన్నట్లు ఎవరో కమిషనర్ ఏవీ రంగనాథ్ కి సమాచారం అందించారు.. దీని పైన స్పందించిన రంగనాథ్.. ఇకపైన అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే ఆయుధాల చట్టంకింద కేస్ నమోదు చేస్తామని హెచ్చరించారు..

ఎవరైనా ఆలా బహిరంగంగా కత్తులు ఊపుతూ, లేదా కత్తులతో కేక్ కట్ చేస్తూ.. కనిపిస్తే ప్రజలు సమాచారం అందించాల్సిందిగా ఆయన సూచించారు.. అలానే తల్వార్ తో ఉన్న పిక్స్ తో ఫ్లెక్సీ పెట్టిన.. కత్తులతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన శిక్ష తప్పదు అని పేర్కొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here