కూటి కోసం కోటివిద్యలు.. ఇది ఒకప్పటిమాట.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటె చాలు. టాలెంట్ తో పనిలేదు.. .కంటెంట్ కాస్త కొత్తగా ఉంటె చాలు.. అయిపోవచ్చు కోటీశ్వరులు.. నేమ్ ఫేమ్ అన్ని వాటంతట అవే వచ్చేస్తాయి.. దీనికోసం యుట్యూబర్లు తెగ హైరానా పడిపోతుంటారు.. రకరకాల చానెల్స్ ని యూట్యూబ్ వేదికగా నడుపుతుంటారు.. ఇందులో కొందరు భోజన ప్రియుల కోసం ఫుడ్ చానెల్స్ ని అంటే కొందరు ఎలా వండాలో చూపిస్తే మరికొందరు ఎలా తినాలో చూపిస్తుంటారు.. అందులో కొన్ని వీడియోలు చాల వైరల్ అవుతుంటాయి.. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నట్టింట్లో చక్కెర్లు కొడుతుంది..
నార్త్ ఇండియన్స్ ముఖ్యంగా మధ్యప్రదేశ్, మాహారాష్ట్ర ఈ ప్రాంతాల వైపు అటుకులతో తయారు చేసిన వంటలకి చాలా ప్రాముఖ్యత ఉంది.. ఇంకా చెప్పాలంటే చిరు వ్యాపారులకు ఇదే జీవనోపాధి.. అందుకే ఆక్కడ ఎక్కడ చూసిన రోడ్ పక్కల ఈ చిరు వ్యాపారులే కనిపిస్తుంటారు.. అటుకులతో రకరకాల వంటలు చేసి విక్రయిస్తుంటారు.. అయితే తాజాగా ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి చేసిన పోహా వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
ఈ వీడియోలో అతను పోహా చేసిన తీరుని చూసి వీక్షకులు తెగ కామెంట్స్ పెడుతున్నారు.. ఇది ఎం వంటరా నాయనా.. ఇలాంటి పోహా లైఫ్ లో చూడలేదు.. ఇలాంటివి చూస్తే తిండిమీదేనే విరక్తి పుడుతుంది లాంటి కామెంట్స్ చేస్తున్నారు.. ఇంతకీ ఆ వ్యాపారి ఈ పోహా ఎలా చేసారు అనుకుంటున్నారా..
ముందుగా రాత్రి నానబెట్టిన అటుకులని తీసుకొని నా, అందులో ముందుగా కాస్త ఉప్పు వేసి మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత అందులో పంచదార వేసిన అనంతరం కొన్ని అరటిపండు ముక్కలను జత చేస్తాడు..అనంతరం దానిపై రసగుల్లా వేస్తాడు.. ఆ తర్వాత పాలు, ఇంకా పెరుగు వేస్తాడు..ఎదురుచూస్తున్న కస్టమర్ల చేతిలో పెడతాడు. ఇప్పుడు ఈ వీడియో నట్టింట తెగ వైరల్ అవుతుంది.. మరి ఆ వీడియొ ని మీరు ఒకసారి చూసెయ్యండి’