భార్యను గొంతుకోసి ప్లాస్టిక్‌ కవర్‌ లో..

0
52

ఆశ..ఆశ..ఆశ మూవీ సినిమా చూశారా? అందులో ప్రకాశ్‌ రాజ్‌ మరదల కోసం తన భార్యకు మత్తు మాత్రలు ఇచ్చి.. ఆమె మత్తులో జారిపోయాక.. ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి చంపేసే సీన్‌ ఆ సినిమాలో హైలెట్‌ అందులో హీరోగా అజిత్‌ నటించాడు. ఆ సినిమా 8 సెప్టెంబర్, 1995లో సంచళనం సృష్టించింది. అయితే అదే సినిమాను ఓ ప్రబుద్ధుడు ఫాలో అయ్యాడు. తన భార్యను గొంతుకోసి చంపేసి ప్లాస్టిక్‌ కవర్‌ తో చుట్టి ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో చోటుచేసుకుంది.మహారాష్ట్రకు చెందిన దంపతులు ఏడాదిగా ఎర్నాకులంలోని గిరినగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. కొద్దిరోజులు ఆనందంగా సాగిన వారికాపురంలో మనస్పర్థలు ఎదురయ్యాయి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్త .. భార్య గొంతు కోసి చంపేశాడు. భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఇంట్లో ఉంచాడు. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని నిన్న (అక్టోబర్ 24న) సాయంత్రం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా మహిళ మృతదేహం కవర్‌లో చుట్టి కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. నిందితుడు భార్యను హత్య చేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అద్దెకు తీసుకున్న సమయంలో దంపతులు తమ గుర్తింపు కార్డు, ఇతర పత్రాలు ఇవ్వలేదని ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. వీరిద్దరి పేర్లు నిజమా కాదా అనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here