ఈ మధ్యకాలంలో బందాలకి అనుబంధాలకి తావు లేకుండా పోయింది.. నమ్మిన వాళ్ళే నట్టేట ముంచుతున్నారు.. తోడబుట్టిన వాళ్ళు తోడేళ్లుగా మారుతున్నారు.. కడుపున పుట్టినోళ్లు కన్నోళ్ళేనే కాటికి పంపుతున్నారు.. కన్న తల్లిదండ్రులే కడుపున పుట్టిన బిడ్డలని కిరాతకంగా చంపినా సందర్భాలు కోకొల్లలు.. అలాంటి ఘటనే ఇప్పుడు జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది..
జగిత్యాల జిల్లా భీమునిదుబ్బ ప్రాంతంలో బంకా శ్రీనివాస్, మాధవి అనే దంపతులు నివాసం ఉంటున్నారు.. ఈ దంపతులకి ముగ్గురు పిల్లలు.. దీప్తి, చందన, సాయి. దీప్తి హైదరాబద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంది.. కాగా ప్రస్తుతం వర్క్ ఫ్రొం హోమ్ కారణంగా ఇంటి నుండే పని చేస్తుంది.. ఇక రెండో కూతురు చందన బీటెక్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉండగా .. కొడుకు సాయి బెంగుళూర్ లో ప్రయివేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు..
కాగా బంధువులు రావడంతో శ్రీనివాస్ మరియు మాధవి ఆదివారం హైదేరాబద్ వెళ్లారు.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు కుమార్తెలతో ఫోన్ లో మాట్లాడారు. . తిరిగి మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేయగా పెద్ద కూతురు దీప్తి ఫోన్ తీయ్యలేదు.. చిన్న కూతురికి చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది.. దీనితో కంగారు పడిన తల్లిదండ్రులు పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పగా వాళ్ళు వెళ్లి తలుపులు తీసి చూసేసరికి దీప్తి సోఫాలో అపస్మారక స్థితిలో పడి ఉంది..
వెంటనే ఈ విషయాం గురించి తల్లి దండ్రులకి సమాచారం ఇచ్చారు..తదనంతరం స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.. అనంతరం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించగా వంట ఇంట్లో రెండు మద్యం సీసాలు, శీతల పానీయం సీసా తో పాటుగా ఆహార పాట్లాలు కనిపించాయి..
చందన ఆచూకీ దొరకలేదు.. దీనితో చెల్లె అక్కని చంపి పారిపోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. పెద్ద కుమార్తె మరణం తో విలపిస్తున్న తల్లిదండ్రులు అనుమానస్థితిలో కుమార్తె చనిపోయిందని ఫిర్యాదు చేశారు.. చందన కనిపించకపోవడంతో పోలీసులు బస్సు స్టాప్ లోని సి.సి కెమెరాలు పరిశీలించగా సోమవారం ఉదయం 5.12 గంటల నుంచి 5.16 గంటల వరకు ఓ యువకుడితో కలిసి నిజామాబాద్ బస్టాండ్‌లో కూర్చుంది. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కినట్లు కెమెరాల్లో రికార్డయింది. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు దీప్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
చందనం ఎక్కడికి పోయింది? ఆమెను వెంబడిస్తున్న యువకుడు ఎవరు? ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? మరెవరైనా మద్యం సేవించారా? ఆ యువకుడితో చందన ఎందుకు పారిపోయింది? దీప్తి హత్య చేసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెల్లి చందన, తనతో వున్న యువకుడు దొరికితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.