మెట్రో స్టేషన్‌ దగ్గర బర్త్‌డే వేడుకలు.. పాపులర్ యూట్యూబర్ అరెస్ట్

0
175

ప్రస్తుతం యూట్యూబర్స్ కూడా సెలబ్రిటీస్‌గా మారిపోతున్నారు. వారికంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ యూట్యూబర్ తీసుకున్న నిర్ణయానికి ఆయన అభిమానుల హడావుడి తోడై ప్రజలు ఇబ్బందులు పాలైన ఘటన ఇది. ఈ తతంగం అంతటికీ ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలోని సెక్టార్‌ 51 మెట్రో స్టేషన్‌ వేదికైంది. ఫ్లయింగ్ బీస్ట్‌గా పేరొందిన యూట్యూబర్ గౌరవ్ తనేజా అతని పుట్టినరోజును జరుపుకోవడానికి శనివారం నోయిడాలోని ఆక్వా లైన్ సెక్టార్ 51 మెట్రో స్టేషన్‌లో అతని అభిమానులు గుమిగూడడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో నిబంధనల ఉల్లంఘన పేరిట పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అంతకుముందు.. అతను తన పుట్టినరోజును నోయిడా మెట్రోస్టేషన్‌లో అభిమానుల మధ్య జరుపుకొంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఓ మెట్రో కోచ్‌నూ బుక్‌ చేసినట్లు సమాచారం. దీంతో అతన్ని కలిసేందుకు వేలాది మంది.. మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. ఒక్కసారిగా తలెత్తిన రద్దీ కారణంగా స్థానికంగా తొక్కిసలాట జరిగింది.

YSRCP President: “శాశ్వత అధ్యక్షుడు” అనే ఐడియాని జగన్‌ పార్టీకి ఎవరిచ్చారంటే?..

రద్దీ కారణంగా మెట్రో ప్రయాణికులు, మెట్రో సిబ్బంది ఇబ్బందుల పాలయ్యారు. వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వారికి మెట్రోస్టేషన్‌ కింద టోకెన్లను పంపిణీ చేయడంతో.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సకాలంలో అక్కడి చేరుకుని రహదారులను క్లియర్ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతో నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ‘ఫ్లయింగ్ బీస్ట్’ పేరిట ఉన్న అతని యూట్యూబ్‌ ఛానెల్‌కు 75.8 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here