రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతి చెందినది తెలిసిందే. అయితే దీనిపై తాజాగా.. డీఎంఏ ఆఫీస్ లో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. 25న ఇబ్రహీంపట్నం సివిల్ హాస్పిటల్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించామని, అనుభవం ఉన్న సర్జన్ తోనే 34 మందికి ఆపరేషన్లు చేశారన్నారు. ఆపరేషన్లు చేయించుకున్నవాళ్ళు కొన్ని గంటలు మాత్రమే హాస్పిటల్ లో ఉండాల్సి ఉంటుందని, ఆపరేషన్లు చేయించుకున్న వారిలో నలుగురు చనిపోయారన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటన ఫస్ట్ టైం అని, కాజ్ ఆఫ్ డెత్ కోసం నలుగురికి పోస్ట్ మార్టం నిర్వహించామన్నారు. మిగతా 30 మందికి కూడా… స్పెషల్ మెడికల్ టీం వాళ్ళ ఇంటికి వెళ్లి హెల్త్ కండిషన్ మానిటరింగ్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
30 మందిలో ఏడుగురిని హైదరాబాద్ లోని స్పెషల్ హాస్పిటల్ కి తీసుకొచ్చామని, మరో ఇద్దరిని నిమ్స్ కి తరలించామని, చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా… డబుల్ బెడ్ రూమ్ ఇల్లు… వాళ్ళ పిల్లల చదువుకు కూడా తోడ్పాటు అందిస్తామన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తెలంగాణ లోనే కాకుండా… దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ అని, గతేడాది తెలంగాణలో 38 వేల మందికి పైగా ఆపరేషన్లు నిర్వహించామని, ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు చేసిన డాక్టర్ … చాలా నిష్ణాతుడు అని ఆయన వెల్లడించారు. మిగితా 30 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ముందస్తు చర్యలో భాగంగా వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు ఆయన వివరించారు.