చంద్రబాబు, పవన్ పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు

0
689

రాజకీయ వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. మంత్రులు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రేమికులు దొరుకుతారేమో అని తిరుగుతున్నారు. అందుకే అనకాపల్లి జిల్లాలో ఈ రెండు రోజుల సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు.

74 ఏళ్ల చంద్రబాబునాయుడు నాది వన్ సైడ్ లవ్వు నన్ను ఎవరు ప్రేమించడం లేదని బాధ పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రేమించిన వ్యక్తి పోటీ చేసిన దగ్గర ప్రతి దగ్గర ఓడిపోతుంటాడు. అతనికి ఏమైనా మూడు ఉండాలి, అందుకే మూడు ఆప్షన్ లు ఇస్తున్నాడు. ముగ్గురు కాదు పదిమంది వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఓడించడం మీ తరం కాదన్నారు అమర్నాథ్.

నీ తెలుగుదేశం పార్టీ, నువ్వు ముసల్ది అయిపోయింది మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు. స్థానిక తెలుగుదేశం పార్టీ దోపిడీ దొంగలు సీటు కోసం నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీరు కాదు మీ చంద్రబాబు నాయుడు, లోకేష్ అనకాపల్లిలో పోటీ చేయాలని సవాల్ విసిరారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అసలే విశాఖ రాజకీయాలు సముద్రం అలలంత హాట్ హాట్ గా వుంటాయి. తాజా సవాల్ పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here